Nayanthara in Nesippaya event: సౌత్ లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న.. నయనతార చాలావరకు తన సినిమా ప్రమోషన్స్ లో.. కనిపించరు. ఆఖరికి తన హిందీ డెబ్యూ సినిమా జవాన్ కి.. కూడా నయనతార రాలేదు.  తన సినిమాలను కూడా ప్రమోట్ చేయని.. నయనతార విష్ణువర్ధన్ దర్శకత్వంలో.. త్వరలో విడుదల కాబోతున్న.. నిసిప్పాయ అనే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ ఈవెంట్ కి వచ్చి అభిమానులకి.. సైతం షాక్ ఇచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందమైన నల్లటి చీర కట్టుకుని.. నయనతార తన లుక్స్ తో ప్రేక్షకులను.. ఫిదా చేసింది. ఆ వేడుకలో మాట్లాడుతూ అసలు ఎప్పుడూ.. ఏ ఈవెంట్ కు రాని తను విష్ణువర్ధన్ సినిమా ఈవెంట్ కి..రావడానికి ఒక కారణం ఉంది అని తెలిపింది. 


నిషిప్పాయ ఒక ఫ్యామిలీ సినిమా అంటూ కితాబిచ్చింది నయన్. "నేను మామూలుగా ఇలాంటి ఈవెంట్‌ లకు హాజరు కాను. కానీ ఇది నాకు నిజంగా.. ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది నా దర్శకుడు విష్ణు సినిమా. నా బెస్ట్ ఫ్రెండ్ అను సినిమా. ఇది నాకు దాదాపు.. ఒక కుటుంబంలో జరిగే ఈవెంట్ లాంటిది. కాబట్టి నేను నో చెప్పే ప్రసక్తే లేదు" అని అన్నారు.


"విష్ణు మంచి డైరెక్టర్. అంతకన్నా మంచి మనిషి. నాకు ఆయన 10-15 ఏళ్లుగా తెలుసు." అని తమ స్నేహం గురించి చెప్పారు నయనతార. దివంగత నటుడు మురళి తనయుడు ఆకాష్ మురళి డెబ్యూ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ, “మీరు ఆకాష్‌ ని.. పరిచయం చేస్తున్నందుకు నాకు చాలా.. సంతోషంగా ఉంది. మీకంటే తనకి ఇంకెవరూ తనకి బెస్ట్ ఇవ్వలేరు" అని అన్నారు. 


"నెసిప్పాయ చాలా రిఫ్రెష్‌గా అనిపించింది. సినిమా కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను. చాలా కాలం తర్వాత.. ఓ మంచి ప్రేమకథ రాబోతోంది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ.. నా అభినందనలు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను" అని నయనతార అన్నారు.


Also Read: TDP Toll Free: మీ సమస్య సీఎం చంద్రబాబుకు చెప్పాలా? అయితే ఈ నంబర్‌కు ఫోన్‌ చేయండి


Also Read: Ali Resign: రాజకీయాలు నా వల్ల కాదు.. ఇక సినిమాలు చేసుకుంటా: అలీ సంచలన ప్రకటన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి