Nayanthara, Samantha Akkineni, Deepika Singh Goyal trolled; నయన్ తార, సమంత అక్కినేని వంటి సినిమా హీరోయిన్స్‌కి దీపిక గోయల్, జాస్మిన్ భాసిన్ వంటి టీవీ నటీమణులకు ఈ వారం నెటిజెన్స్ ట్రోల్ చేసి చుక్కలు చూపించారు. నెటిజెన్స్ ఎందుకలా రియాక్ట్ అయ్యారు ? నెటిజెన్స్ కి కోపం తెప్పించేలా వాళ్లు ఏం చేశారు అనే వివరాలు ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Nayanthara trolled- నయన్‌తారపై ట్రోలింగ్
నయనతార కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న విషయాన్ని వెల్లడిస్తూ ఆమె బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఆ ఫోటోలో వ్యాక్సిన్ ఇస్తున్న నర్సు చేతిలో అసలు వ్యాక్సిన్ ఉన్నట్టే కనిపించలేదు. దీంతో నయన్ తార వ్యాక్సిన్ ఇప్పించుకుందన్న వార్తలో నిజం లేదని కొంతమంది నెటిజెన్స్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. నయనతారపై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించిన నయనతార పీఆర్ టీమ్.. ఆమె వ్యాక్సిన్ తీసుకున్నమాట వాస్తవమేనని చెప్పాల్సి వచ్చింది.    


Also read : RGV సినిమా షూటింగులో exploitation: రాధికా ఆప్టే బోల్డ్ కామెంట్స్


Samantha Akkineni trolled- సమంత అక్కినేనిపై ట్రోలింగ్
సమంత అక్కినేని తొలిసారిగా ది ఫ్యామిలీ మేన్ 2 అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ది ఫ్యామిలీ మేన్ 2 ట్రైలర్ ఇటీవలే ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఈ సిరీస్‌లో సమంత తమిళ నేపథ్యం ఉన్న ఓ టెర్రరిస్ట్ పాత్రలో నటించింది. అయితే, ట్రైలర్ చూసిన తమిళులు.. ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ తమిళులకు వ్యతిరేకంగా ఉందంటూ అలాంటి పాత్రకు సైన్ చేసినందుకు సమంతను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.



Also read : Chiranjeevi oxygen banks: అప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్.. ఇప్పుడు చిరంజీవి ఆక్సీజన్ బ్యాంక్స్


Jasmin Bhasin trolled- జాస్మిన్ భాసిన్‌కు ట్రోలింగ్ కొత్త కాదు
ఈ వారం ట్రోలింగ్‌కి గురైన వారిలో టీవీ నటి జాస్మిన్ భాసిన్‌ కూడా ఉంది. జాస్మిన్‌కు ట్రోలింగ్ కొత్త కాదు. బిగ్ బాస్ 14వ సీజన్‌లో కనిపించింది మొదలు ఆమె ఎప్పుడూ, ఏదో ఓ అంశంతో సోషల్ మీడియాకెక్కుతూనే ఉంది. ముఖ్యంగా బిగ్ బాస్ హౌజ్‌లో తన యారోగంట్ బిహేవియర్‌తో ఆమె నెటిజెన్స్ చేత అనేకసార్లు తిట్టించుకుంది.


Gauahar Khan trolled - గౌహర్ ఖాన్‌పై ట్రోలింగ్
బాలీవుడ్ నటి గౌహర్ ఖాన్ ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసుకుంది. ఆ వీడియోలో ఆమె తన భర్త జయేద్ దర్బార్ పాదాల వద్ద తన తల పెట్టుకుని పడుకున్నట్టుగా ఉండటం చూసిన ఓ నెటిజెన్స్ కొంతమంది ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఓ యూజర్ ఏకంగా ఆడది ఎప్పుడైనా మగాడి కాళ్ల కిందే అనే అర్థం వచ్చేలా అనే అర్థం వచ్చేలా ఓ కామెంట్ పెట్టాడు. అతడి కామెంట్‌కి స్పందించిన గౌహర్ ఖాన్.. ఒకరి సాన్నిహిత్యంలో మరొకరికి ఉండే కంఫర్ట్‌తో అలా ఉంటారు కానీ అంత మాత్రానికే ఇష్టం వచ్చినట్టు ఊహించుకోకూడదని, ఇస్లాంలో స్త్రీలు మగాళ్ల కంటే ఎక్కువో తక్కువో అని కాదు.. మగాడి పక్కనే స్త్రీకి స్థానం ఉంటుందని ఘాటైన కౌంటర్ ఇచ్చింది.  


Also read: Nayanthara Trolls: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న నయనతారపై నెటిజన్ల ట్రోలింగ్, అసలు విషయం ఏంటంటే


Deepika Singh Goyal trolled - దీపికా సింగ్ గోయల్ ట్రోల్డ్
తౌక్టె తుపాన్ ధాటికి పశ్చిమ తీరంలో ఎంతో మంది జీవితాలు రోడ్డునపడ్డాయి. ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. అనేక చోట్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. ఇదే విపత్కర పరిస్థితుల్లో టీవీ నటి దీపికా సింగ్ గోయల్ తుపాన్‌ను ఎంజాయ్ చేస్తూ ఫోటోలు, వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తౌక్టే తుపానుతో (Cyclone Thauktae
) సకలజనం ఇబ్బందిపడుతున్న ప్రస్తుత సమయంలో సోషల్ మీడియాలో పోస్ట్ అయిన దీపికా సింగ్ గోయల్ డ్యాన్స్ వీడియో జనానికి ఆగ్రహం తెప్పించింది. ఇంకేం.. ట్రోల్ చేయకుండా ఉంటారా మరి.


Also read : Pushpa Part 1, Part 2 titles: పుష్ప సినిమా పార్ట్ 1, పార్ట్ 2 కి వేర్వేరు టైటిల్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook