ONGC Barge P 305: తౌక్టే తుపాన్ ధాటికి మునిగిన ఓడలు.. 22 శవాలు లభ్యం, 65 మంది మిస్సింగ్

ONGC Sunken Barge P 305, Cyclone Tauktae: ముంబై: తౌక్టే తుపాను చాలా మంది జీవితాల్లో పెను విషాదం నింపింది. మహారాష్ట్రపై తౌక్టే తుపాను ప్రభావం అధికంగా కనిపించింది. ముంబైకి సమీపంలో అరేబియా సముద్రంలో భారీ నౌకలు కొట్టుకుపోయాయి. బాంబే హై ప్రాంతంలో ఓఎన్జీసీ చమురుక్షేత్రం వద్ద సేవలు అందిస్తున్న పి 305 అనే భారీ నౌక (ONGC Barge P 305) తుపాన్ ధాటికి సముద్రంలోనే మునిగిపోయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 19, 2021, 04:49 PM IST
ONGC Barge P 305: తౌక్టే తుపాన్ ధాటికి మునిగిన ఓడలు.. 22 శవాలు లభ్యం, 65 మంది మిస్సింగ్

ONGC Sunken Barge P 305, Cyclone Tauktae: ముంబై: తౌక్టే తుపాను చాలా మంది జీవితాల్లో పెను విషాదం నింపింది. మహారాష్ట్రపై తౌక్టే తుపాను ప్రభావం అధికంగా కనిపించింది. ముంబైకి సమీపంలో అరేబియా సముద్రంలో భారీ నౌకలు కొట్టుకుపోయాయి. బాంబే హై ప్రాంతంలో ఓఎన్జీసీ చమురుక్షేత్రం వద్ద సేవలు అందిస్తున్న పి 305 అనే భారీ నౌక (ONGC Barge P 305) తుపాన్ ధాటికి సముద్రంలోనే మునిగిపోయింది. భారీ ఓడలు సముద్రంలో చిక్కుకుపోయి మునిగిపోయిన ఘటనలో నేవి సిబ్బంది యుద్ధ నౌకలు, హెలీక్యాప్టర్లను రంగంలోకి దింపి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. 

Also read : Tauktae Effect: పశ్చిమ తీరంలో కొట్టుకుపోయిన నౌక, 273 మందిని కాపాడే ప్రయత్నాలు

మొదటి నుంచి జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌లో సహాయక సిబ్బంది మొత్తం 186 మందిని రక్షించారు. తాజాగా ముంబై సముద్ర తీరంలో 22 శవాలు లభ్యమయ్యాయి. మరో 65 మంది ఆచూకీ గల్లంతయ్యింది. ఆచూకీ గల్లంతయిన వారి కోసం సెర్చ్ ఆపరేషన్ (Search operation) జరుగుతోంది. ఈ సెర్చ్ ఆపరేషన్‌ కోసం ఇండియన్ నేవీకి చెందిన ఐదు నౌకలు, హెలీక్యాప్టర్లు ఉపయోగిస్తున్నారు. ఇండియన్ నేవీ (Indian Navy), ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు.

మహారాష్ట్ర, గుజరాత్, గోవా, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలపై తౌక్టే తుపాను (Cyclone Tauktae) ప్రభావం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు తౌక్టే తుపాను ధాటికి చిగురుటాకులా వణికిపోయాయి. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News