Vignesh Shivan special treat to Nayanthara with local delicacies: కోలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ నయనతార, విఘ్నేశ్‌ శివన్‌లు ఒక్కటి కాబోతున్నారు. 5-6 ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్న ఈ ప్రేమ జంట నేడు (జూన్‌ 9న) ఏడడుగులు వేయబోతున్నారు. మహాబలిపురంలోని ఓ ప్రైవేట్ రీసార్ట్‌లో నయన్-శివన్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. అత్యంత భారీ భద్రత మధ్య కుటుంబ సభ్యులు, సన్నిహితుల, ప్రముఖుల సమక్షంలో ఈ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రస్తుతం ఏడ చూసినా.. నయన్-శివన్ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొన్ని రోజుల క్రితం డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఓ వీడియోను పంచుకున్నాడు. కాబోయే భార్య నయనతారకు విఘ్నేష్ స్పెషల్ ట్రీట్ ఇచ్చాడు. స్థానిక వంటకాలతో నయనతారకు విందు భోజనం పెట్టాడు. శాకాహారం, మాంసాహారంతో కూడిన అన్ని రకాల వంటకాలు అందులో ఉన్నాయి. నయనతారకు ఏది కావాలో అడిగి మరీ తినిపించాడు విఘ్నేష్. దాంతో నయన్ తెగ ఆనందపడిపోయింది. అయితే ఈ స్పెషల్ ట్రీట్ ఇచ్చింది పెద్ద హోటల్లో కాదు.. ఇంటి టెర్రస్‌పై.  ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. 



నేడు పెళ్లి సందర్భంగా విఘ్నేశ్‌ శివన్‌ తాజాగా చేసిన ఓ ఆసక్తికర పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నయనతార పెళ్లి కుమార్తెగా ముస్తాబై వేదికపైకి నడుచుకుంటూ వస్తుంటే.. చూడటానికి తాను ఉత్సాహంగా ఉన్నట్లు చెప్పాడు. 'ఈ రోజు జూన్‌ 9. ఈరోజు నయన్‌ డే. భగవంతుడు, నా జీవితంలోని ప్రతిఒక్కరి ఆశీస్సులకు ధన్యవాదాలు. నా జీవితం ఇంత అందంగా ఉండటానికి మంచి వ్యక్తులు, టైమ్, మధుర సంఘటనలు, ఆశీస్సులు, షూటింగ్‌ రోజులు, దేవుడి ప్రార్థనలే కారణం. ఇప్పుడు నయన్‌కు అన్నింటిని అంకితం చేస్తున్నాను. నయన్.. నువ్వు పెళ్లి కుమార్తెగా ముస్తాబై వేదికపైకి రావడాన్ని చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నా' అని ట్వీట్ చేశారు. 


Also Read: Astro Tips: ఇలా చేస్తే తరగని సంపద మీ సొంతం.. ఇంట్లో ధనం నిలిచి ఉంటుంది...


Also Read: Viral News: రూ.50 వేలు ఇస్తేనే కొడుకు శవం.. లంచం డబ్బుల కోసం వీధుల్లో ఆ పేద తల్లిదండ్రుల భిక్షాటన


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook