NBK@50 Years: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ సినీ వారసుడిగా  ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ త్వరలో 50 యేళ్ల  నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 1వ తేదిన ఫిల్మ్ ఇండస్ట్రీ తరుపున ఈ నందమూరి నాయకుడిని ఘనంగా సత్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి సహా సినీ ఇండస్ట్రీ తరుపున పలువురు పెద్దలను ఇప్పటికే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్,  తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్లు కలిసి అందరికీ ప్రత్యేకంగా ఆహ్వాన లేఖలు అందిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడును  కలిసి నందమూరి బాలకృష్ణ గారి స్వర్ణోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 సినీ ఇండస్ట్రీ తరఫున ఆహ్వానించిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హానరబుల్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ , తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హానరబుల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్, మరియు కె. ఎల్. నారాయణ, అలంకార్ ప్రసాద్, నిర్మాత జెమినీ కిరణ్, నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ కొమ్మినేని వెంకటేశ్వరరావు, శ్రీ రాజా యాదవ్ ఆహ్వానించిన వారిలో ఉన్నారు.


నందమూరి బాలకృష్ణ  టాలీవుడ్ సినీ రంగ ప్రవేశం చేసి 50 యేళ్లు  పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న  హైదరాబాద్ హైటెక్స్  నోవోటెల్ హోటల్లో  తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడుని టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ  తరుపున ఆహ్వానించారు.  అంతేకాదు నారా  చంద్రబాబు నాయుడు ఈ వేడుకకు రావడంపై సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు.
 
50 యేళ్లుగా ఒక నట వారసుడిగా చిత్ర పరిశ్రమలో హీరోగా ఇప్పటికీ కొనసాగుతున్న హీరో ఎవరు లేరు. మొత్తంగా వరల్డ్  సినీ చరిత్రలో ఓ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి  50 యేళ్లుగా హీరోగా నటిస్తున్న నటుడు మరెవరు లేరు. ఈ 50 యేళ్ల ప్రస్థానంలో 90 శాతం సినిమాల్లో టైటిల్ రోల్స్ పోషించిన వారు కూడా ఎవరు లేరు.‘తాతమ్మ కల’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన  నందమూరి బాలకృష్ణ యాక్టర్ గా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 109వ సినిమా చేస్తున్నారు.ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.


బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి సంబంధించిన ఈ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు అతిరథ, మహారథులు హాజరు కానున్నారు. అంతేకాదు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ వేడుకకు హాజరయ్యే అవకాశాలున్నాయి. 


ఇదీ చదవండి:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..


ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి