waltair Veerayya Boss Party చిరంజీవి, బాలకృష్ణ సినిమాల మధ్య ఉండే పోటీ కన్నా.. వారి అభిమానుల మధ్య ఉండే గొడవలే హైలెట్ అవుతుంటాయి. ఈ సంక్రాంతికి ఈ ఇద్దరూ బరిలోకి దిగుతున్నారు. అక్కడ బాక్సాఫీస్ పోటీ మొదలు కాక ముందు ఇప్పుడు సోషల్ మీడియాలో పోటీ మొదలైంది. మొదటి రౌండ్‌ అంటే ఫస్ట్ సింగిల్ రూపంలో రెండు కోళ్లు పోటీ పడ్డట్టుగా నెటిజన్లు భావిస్తున్నారు. ఇందులో ఫస్ట్ సింగిల్‌తో బాస్ పార్టీ అంటూ నెగ్గేశాడు చిరంజీవి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాలయ్య వీర సింహా రెడ్డి నుంచి విడుదల చేసిన జై బాలయ్య పాట కాపీ క్యాట్ అవ్వడంతో వెనక్కి పడిపోయింది. తమన్ కొట్టిన ఈ పాటను జనాలు దారుణంగా ట్రోల్ చేశారు. ఒసేయ్ రాములమ్మ పాట ట్యూన్‌ను ఉన్నది ఉన్నట్టుగా వాడేశాడని జనాలు జై బాలయ్య పాటను సైడ్ చేశారు. ముందుగా ట్రోలింగ్‌కు గురైన బాస్ పార్టీ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది.


దేవీ శ్రీ ప్రసాద్ రాసి, పాడిన బాస్ పార్టీ సాంగ్ ఇప్పుడు హైలెట్‌గా నిలిచింది. సాంగ్‌ ఆఫ్ ది ఇయర్ అనేట్టుగానే ఈ పాట ఉంది. యూట్యూబ్‌లో ఇప్పటికే ఈ పాటకు ఇరవై ఐదు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అంటే రెండున్నర కోట్ల మంది ఈ పాటను వీక్షించారు. అదే సమయంలో వీర సింహా రెడ్డి జై బాలయ్య పాటను కోటి ఇరవై లక్షలు మాత్రమే వీక్షించినట్టు కనిపిస్తోంది.


అలా ఈ పరుగు పందెంలో బాలయ్య ఎక్కడో ఆగిపోయాడు. కానీ చిరంజీవి మాత్రం దూసుకుపోతోన్నాడు. బాసూ వేర్ ఈజ్ ది పార్టీ, డీజే వీరయ్య అంటూ చిరంజీవి పాట మార్మోగిపోతోంది. ఇక సంక్రాంతి బరిలో ఈ రెండు చిత్రాలు ఎలాంటి వసూళ్లు రాబడతాయో అన్నది ఆసక్తికరమైన అంశంగా మారింది.


Also Read : RGV Siri Stazie : రాళ్లతో కొట్టి చంపేసేవారు, వెలేసేవారు.. అలా బతికిపోయారు.. ఆర్జీవీపై బీవీఎస్ రవి కామెంట్స్


Also Read : Pawan Kalyan Martial Arts : పవన్ కళ్యాణ్ మీద ట్రోలింగ్.. మంచో చెడో కానీ సంతోషంగా ఉందన్న మంచు లక్ష్మీ


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook