Sharing Netflix Password Become Punishable & Jailed You: సాధారణంగా ఏదైనా ఓటీటీ సభ్యత్వం ఒకరికుంటే..ఆ పాస్‌వర్డ్ వివరాల్ని బంధుమిత్రుల్లో నలుగురైదుగురు పంచుకుంటుంటారు. దీనివల్ల ఆయా ఓటీటీ సంస్థలకు నష్టం వాటిల్లుతోంది. అందుకే ఈ పరిస్థితిని నివారించేందుకు నెట్‌ఫ్లిక్స్ రంగంలో దిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ కొత్త నిబంధన ప్రవేశపెట్టింది. ఈ నిబంధన ప్రకారం ఇకపై మీరు ఎవరితోనూ పాస్‌వర్డ్ పంచుకునేందుకు వీలుండదు. అలా చేస్తే చట్టరీత్యా శిక్షార్ఙులై జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఇటీవలి కాలంలో ఓటీటీ ఆదరణ పెరిగినప్పటి నుంచి ఒకరి ఖాతాను నలుగురైదుగురు పంచుకోవడం సాధారణంగా మారిపోయింది. ఇక నుంచి ఆ పరిస్థితి ఉండదు. స్నేహితులు లేదా బంధువులు ఎవరితోనైనా నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ పంచుకుంటే శిక్షార్హులౌతారు. 


ఇక నుంచి నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ వివరాల్ని ఎవ్వరితోనూ పంచుకోకూడదని కొత్త నిబంధనలు చెబుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదిక సబ్‌స్క్రిప్షన్‌లో మరొకరిని భాగస్వామ్యం చేయడం నేరంగా పరిగణిస్తారు. పాస్‌వర్డ్ షేర్ చేయడం వల్ల జైలు శిక్ష లేదా భారీ జరిమానా ఎదుర్కొంటారు. పాస్‌వర్డ్ షేరింగ్ ఇండియాలోనే కాదు యూకేలో సైతం నిషేధించబడింది. ఇకపై పాస్‌వర్డ్ ఎవరితోనైనా షేర్ చేసుకుంటే చట్టప్రకారం చర్యలుంటాయి. పాస్‌వర్డ్ షేరింగ్ వల్ల ఆయా సంస్థలకు విపరీతమైన ఆర్ధిక నష్టం కలుగుతోంది. భవిష్యత్తులో ఇతర దేశాల్లో సైతం ఈ నిర్ణయం తీసుకోనున్నారు.


కరోనా సమయంలో ఓటీటీల వినియోగం బాగా పెరిగిపోయింది. థియేటర్లు మూతపడటం, లాక్‌డౌన్ కారణాలతో ఇంట్లో ఓటీటీలే కాలక్షేపమయ్యాయి. అప్పట్నించి ఓటీటీలకు ఆదరణ పెరగడంతో సినిమాలు కూడా ఇప్పుడు ధియేటర్లతో సమానంగా విడుదల చేస్తున్నారు. లేదా ధియేటర్ విడుదలైన నెల లేదా రెండు నెలల తరువాత ఓటీటీలో విడుదలౌతున్నాయి.


Also Read: Dasara Movie Ticket Rates : టికెట్ రేట్లు తగ్గించిన దసరా టీం.. జనాలు రావడం లేదని ఇలా చేశారా?


Also Read: KKR vs RCB Live Updates: కోల్‌కతా vs బెంగళూరు బిగ్ ఫైట్.. లైవ్ అప్‌డేట్స్ మీ కోసం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook