Pushpa 2 Victim Husband:డిసెంబర్ 4న సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే యువతి  చనిపోవడం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేయడం.. బన్ని బెయిల్ పై విడుదల కావడం అన్ని ఒక సినిమాటిక్ గా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో కొంత మంది నెటిజన్స్ రేవతి భర్తకు న్యాయం జరగాలంటే రష్మికను ఇచ్చి పెళ్లి చేయాలని వింత ప్రతిపాదనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ ఘటనలో తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు ప్రభుత్వం తో పాటు అల్లు అర్జున్, సంధ్య థియేటర్ యాజమాన్యం కక్కుర్తి అన్ని ఉన్నాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఇతర సమస్యలే లేనట్టు ఈ ఇష్యూనే ప్రభుత్వం  హైలెట్ చేస్తుందనే వాదనలు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వం తన వైఫల్యాను కప్పిపుచ్చుకోవడానికే అల్లు అర్జున్ ను బలికా బకరా చేసారానే కామెంట్స్ వినిపిస్తున్నాయి.


కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామిల నుంచి ప్రజలను పక్కదారి పట్టించడానికే తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ ఇష్యూను పెద్దది చేస్తుందనే వాదనలు కొంత మంది నెటిజన్స్ నుంచి వినిపిస్తున్నాయి. మరోవైపు మరికొంత మంది ప్రభుత్వం సామాన్య ప్రజలు.. సెలబ్రిటీలు అనే తేడా లేకుండా చట్టం ముందు అందరు సమానమే అన్నట్టు న్యాయంగా వ్యవహరిస్తుందనే కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు రేవంత్ సర్కార్ గట్స్ ను మెచ్చుకుంటున్నారు. ఇంకోవైపు ఈ కేసులో అల్లు అర్జున్ ను బకరా చేసారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే..సీఎం రేవంత్ రెడ్డి కోర్టు పరిధిలో ఉన్న  అల్లు అర్జున్ ఇష్యూను అసెంబ్లీలో ప్రస్తావించి నిబంధనలు ఉల్లంఘించారనే కామెంట్స్ న్యాయ నిపుణులు నుంచి వినబడుతున్నాయి. మరోవైపు అల్లు అర్జున్ కూడా రేవంత్ రెడ్డి కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. మొత్తంగా ఈ ఇష్యూ చిలికి చిలికి గాలి వానగా మారి ముఖ్యమంత్రి వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్టుగా సాగుతుంది. మరి కాసేట్లో అల్లు అర్జున్ విచారణ నిమిత్తం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లనున్నారు. మరి ఈ కేసులో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తంగా పుష్ప 2 సక్సెస్ అయిందనే సంబురం అల్లు అర్జున్ కు లేకుండా పోయింది.


ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..


ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.