Anasuya Tweet Viral: హ్యాపీ ఫూల్స్ డే అంటున్న అనసూయ.. ఆడేసుకుంటున్న నెటిజన్లు
మరోసారి యాంకర్ అనసూయ ట్రోల్స్ కి గురవుతుంది. ఉమెన్స్ డే ని ఫూల్స్ డే అంటూ విష్ చేసిన అనసూయని నెటిజన్లు తెగ ఆడేసుకుంటున్నారు.
Anasuya Tweet Viral: హాట్.. జబర్డస్త్ యాంకర్ అనసూయ.. అంటే తెలియని తెలుగువాళ్లు ఉండరు. పొట్టి పొట్టి డ్రెస్సులతో టీవీ షోలలో అదరగొట్టడమే కాకుండా.. సినిమాలలో కూడా కొత్తదానం ఉన్న క్యారెక్టర్ లతో ఈ అమ్మడు దూసుకుపోతుంది. అంతేకాదు.. సోషల్ మీడియాలో ఎల్లపుడు యాక్టివ్ గా ఉండే యాంకర్ అనసూయ చాలా సార్లు నెటిజన్ల చేతిలో ట్రోల్స్ కి గురైందనే విషయం తెలిసిందే.
అందంతో పాటు అభినయం కలిగిన అనసూయకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ మనసులో ఉన్న మాటని నిర్భయంగా చెప్పేస్తుంది.. ఎలాంటి జంకు లేకుండా అడిగిన ప్రశ్నలకు సమాధానంతో పాటుగా ట్రోలర్స్ కి సరైన రీతిలో జవాబు చెప్తుంది.
ఈ రోజు అనసూయ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వటమే కాక.. తెగ ట్రోల్స్ కి గురవుతుంది. ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ కారణంగా చాలా మంది సెలబ్రెటీలు మహిళల గురించి, వారి జీవితాల్లో విజయానికి అండగా నిలిచిన మహిళల గురించి ప్రస్తావిస్తూ.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మహిళల త్యాగాలను గుర్తు చేయూసుకుంటూ చాలా మంది పలువురు నెటిజన్లు అనసూయకి విషెష్ తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా అనసూయ పోస్ట్ చేసిన ఒక ట్వీట్ నెటిజన్లను ఆగ్రహానికి గురి చేస్తుంది.
యాంకర్ అనసూయ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో.. " ఈ రోజు ఏంటి సడెన్ గా ట్రోలర్స్ & మీమ్స్ మేకర్స్ మహిళలను తెగ గౌరవిస్తున్నారు..? అయిన ఇది కేవలం 24 గంటలు మాత్రమే కదా.. ఆ తరువాత అంత మాములుగా మారిపోతుంది కదా! అందుకే మహిళలు వీటికి దూరంగా ఉండండి.. హ్యాపీ ఫూల్స్ డే" అంటూ ట్వీట్ చేసింది.
ఇంకేం ఉంది.. ఈ ట్వీట్ చేసిన కాసేపటికే వైరల్ అవ్వగా.. ట్రోలర్స్ అనసూయపై తెగ విరుచుకపడుతున్నారు. అందరు మొగాళ్లు మీరు ఆలోచించే విధంగా ఉండరు అని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. నీ లాంటి ఆడవాళ్లు మమ్మల్ని మోసం చేసారు కాబట్టే ఇలా తయారయ్యాం అని మరి కొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైన అనసూయ ట్వీట్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.
Also Read: Inter Hall Tickets: ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు విడుదల, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే
Also Read: Jayalalitha Death Mystery: అంత అస్వస్థతగా ఉంటే..ఎవరు నిర్లక్ష్యం చేశారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook