Telugu OTT Releases This Week: సుడిగాలి సుధీర్ గాలోడు సహా ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలివే!
Telugu OTT Releases This Week: ఈవారం అంటే రేపు 17వ ఫిబ్రవరి శుక్రవారం నాడు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాల లిస్ట్ మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం, ఒక లుక్ వేసేయండి మరి.
OTT Releases This Week in Telugu : ప్రతివారం ధియేటర్లతో పాటు ఓటీటీల్లో కూడా అనేక సినిమాలు విడుదలవుతున్నాయి. కొన్ని సినిమాలు, వెబ్ సిరీసులు నేరుగా ఓటీటీల్లో విడుదలవుతుంటే మరికొన్ని మాత్రం థియేటర్లలో సందడి చేసిన సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయి. ఇక ఈవారం అంటే రేపు 17వ ఫిబ్రవరి శుక్రవారం నాడు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాల లిస్ట్ మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం.
ముందుగా సుడిగాలి సుదీర్ హీరోగా నటించిన గాలోడు సినిమా ఆహా వీడియో యాప్ తో సహా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇక అదే విధంగా సంతోష్ శోభన్ హీరోగా నటించిన కళ్యాణం కమనీయం సినిమా కూడా ఆహా వీడియో యాప్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమాలతో పాటుగా బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా నటించిన లక్కీ లక్ష్మణ్ సినిమా కూడా ఆహా వీడియో యాప్ లో తెలుగు వెర్షన్ లో విడుదల కాబోతోంది.
ఇక ఇవి తెలుగు సినిమాలు కాగా హిందీలో సర్కస్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇక వెబ్ సిరీస్ ల విషయానికి వస్తే హాట్ స్టార్ లో ది నైట్ మేనేజర్ అనే ఒక వెబ్ సిరీస్ సీజన్ వన్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఇక అది తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. అలాగే హాట్ స్టార్ లో సదా నన్ను నడిపే అనే ఒక తెలుగు సినిమా కూడా ఇప్పటికే అందుబాటులోకి వచ్చేసింది.
అలాగే హాట్ స్టార్ లో రాజయోగం అనే ఒక తెలుగు సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమాలు మాత్రమే కాకుండా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో మాలికాపురం అనే సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఉన్ని ముకుందం ప్రధాన పాత్రలో మలయాళంలో తక్కువ బడ్జెట్ తో రూపొంది సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా తెలుగులో కూడా విడుదలైంది కానీ థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక ఈ సినిమా ఓటీటీలో సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు.
Also Read: Heroes OTT Release: ఓటీటీల మీద కన్నేస్తున్న తెలుగు హీరోలు.. చిరు టు రామ్ చరణ్ ఎవరూ వదలట్లేదు!
Also Read: Trivikram Cooking: ఇంట్లో వంట త్రివిక్రమే చేస్తాడా.. అరెరే ఇలా బయట పెట్టేశాడు ఏంటి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook