Tollywood Heroes debuting on OTT: ఒకప్పుడు హీరోలంటే వెండి తెర మీద మాత్రమే సందడి చేసేవారు, కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒకపక్క టీవీ షోలతో బిజీ అవుతూనే ఓటీటీల్లో కూడా షోలు చేస్తూ నేరుగా ప్రేక్షకులకు దగ్గర అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. బడా హీరోలతో పాటు చోటామోటా హీరోలు సైతం ఈ షోలు చేసేందుకు ఆసక్తి చూపించడమే కాదు ఆయా హీరోలు చేస్తున్న షోలలో గెస్ట్లుగా కూడా కనిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ మీలో ఎవరు కోటీశ్వరులు అనే ప్రోగ్రాంతో బుల్లితెర ద్వారా ప్రేక్షకులకు దగ్గర అవడమే కాదు బిగ్ బాస్ వంటి ఒక ప్రోగ్రాం కూడా చేసి హాట్ టాపిక్ అయ్యాడు. నాగార్జున సైతం మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్ బాస్ వంటి షోలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరవగా చిరంజీవి సైతం ఈ మీలో ఎవరు కోటీశ్వరుడు కొన్ని సీజన్స్ చేశారు. ఇక మరోపక్క రానా సైతం అప్పట్లో వూట్ అనే యాప్ కోసం నెంబర్ వన్ యారి అనే ఒక టాక్ షో చేశారు.
ఈ మధ్య నందమూరి బాలకృష్ణ సైతం ఆహా ఓటీటీ యాప్ కోసం అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె అనే ఒక షో చేసి హాట్ టాపిక్ గా మారారు. ఇక మొట్టమొదటిసారిగా వెంకటేష్ రానా కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ కోసం కలిసి పని చేశారు. ఈ వెబ్ సిరీస్ త్వరలోనే నెట్ఫ్లిక్స్ వేదికగా సందడి చేయబోతోంది. ఇలా కేవలం పెద్దపెద్ద హీరోలు మాత్రమే కాదు హీరో నాని కూడా బిగ్ బాస్ సీజన్ 2 కి హోస్ట్ గా వ్యవహరించడమే కాదు త్వరలోనే ఒక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక నాగచైతన్య కూడా ఓటీటీ కోసం ఒక సిరీస్ చేస్తున్నారు. దూత అనే ఒక వెబ్ సిరీస్ లో ఆయన కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఒక హాలీవుడ్ వెబ్ సిరీస్ తెలుగు వెర్షన్ కోసం రామ్ చరణ్ ను ఇప్పటికే సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన ఒప్పుకున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. హీరోయిన్ల విషయానికి వస్తే ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో సమంత సామ్ జామ్ అనే ప్రోగ్రాం చేసింది. అలాగే మంచు లక్ష్మి ప్రేమతో మీ లక్ష్మీ అనే ఒక టాక్ షో చేయగా ఇప్పుడు ఆహా వీడియో ఒక వంటల ప్రోగ్రాం కూడా చేస్తోంది. కమెడియన్ అలీ సైతం అలీతో సరదాగా అంటూ ఈ టీవీ కోసం ఒక ప్రోగ్రాం చేసిన సంగతి తెలిసిందే.
పోసాని కృష్ణ మురళి బతుకు జట్కా బండి సహా పలు ప్రోగ్రామ్స్ కు జడ్జిగా వ్యవహరిస్తే నాగబాబు, రోజా వంటి వారు జబర్దస్త్ కామెడీ షోలకు జడ్జిలుగా వ్యవహరించారు. ఇక ప్రియమణి, పూర్ణ, సదా, శ్రద్ధాదాస్ వంటి వారు కూడా ఢీ డాన్స్ ప్రోగ్రామ్స్ కి జడ్జిలుగా వ్యవహరించారు. వీరు మాత్రమే కాదు జీవిత, సుమలత వంటి వారు కొన్ని ప్రోగ్రామ్స్ కు జడ్జిలుగా వ్యవహరించగా జగపతిబాబు, శ్రీకాంత్, సాయి కుమార్ వంటి వారు వెబ్ సిరీస్ లు చేస్తూనే వెబ్ సినిమాలలో కూడా నటించారు. ఇక ఇప్పుడు ఎక్కువగా ఓటీటీ అలాగే టెలివిజన్ మీద దృష్టి పెడుతున్న దాఖలాలు ఎక్కువవుతున్నాయి.
Also Read: Ram Charan Narthan movie: ఆగిన క్రేజీ రామ్ చరణ్ ప్రాజెక్ట్.. అసలు విషయం ఏంటంటే?
Also Read: Trivikram Cooking: ఇంట్లో వంట త్రివిక్రమే చేస్తాడా.. అరెరే ఇలా బయట పెట్టేశాడు ఏంటి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook