Devara added scene: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.‌. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా దేవర. జనతా గ్యారేజ్ తరువాత వీరిద్దరి కాంబినేషన్లో.. వచ్చిన సినిమా కావడంతో ఈ చిత్రంపై మొదటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. మరోపక్క ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత వచ్చిన సినిమా కావటంతో.. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల వారు ఈ చిత్రం కోసం ఎదురుచూశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం.. మొదటి షో నుంచే కలెక్షన్స్ సునామి సృష్టించడం మొదలుపెట్టింది. తెలుగు, హిందీ భాషలలో ఇప్పటికే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సొంతం చేసుకుంది. ఇక ఈ రోజు నుంచి లాభాల బాట పట్టిన ఈ చిత్రం కలెక్షన్స్ మరింత పెంచటానికి.. సినిమా యూనిట్ సరికొత్త ప్లాన్ తో ముందుకొచ్చింది. 


అదేమిటి అంటే ఈ చిత్రంలో ముందుగా తీసేసిన..దావూదీ సాంగ్.. ఇప్పుడు ఈ చిత్రంలో యాడ్ చేసింది. దీంతో పాటు జాన్వి కపూర్ కి సంబంధించిన ఒక సీన్ కూడా సినిమా యూనిట్ ఈ చిత్రంలో జోడించింది. ఈ సినిమా రెండో హాఫ్ లో.. వర చెల్లెలను రౌడీలు ఏడిపిస్తారు. ఆ విషయం తెలిసిన వర.. వారిని పోయి చితక్కొట్టారు. అయితే ఆ సీన్ తరువాత నుంచే.. కొత్త సీన్ అలానే పాటను యాడ్ చేశారు సినిమా యూనిట్. ఆ సీన్ అయిన వెంటనే జాన్వి కపూర్ పోయి ఈ విషయాన్ని తన తండ్రి శ్రీకాంత్ కి చెబుతుందంట.. ఇక అప్పుడు ఈ సాంగ్ వస్తుంది. 


 



జాన్వి కపూర్ అభిమానులు ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా చిన్నదని బాధపడ్డారు. ఈ క్రమంలో.. ఇప్పుడు జాహ్నవి కపూర్ కి సంబంధించిన ఒక సీన్ అలానే పాట ఆడ్ చేయడంతో.. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అలానే జాన్వి కపూర్ అభిమానులు మరోసారి సినిమాకి పరుగులు తీయడం ఖాయంలా కనిపిస్తోంది. వచ్చే వారం అంతా దసరా సెలవులు ఉన్నాయి.. మరోపక్క తెలుగులో కొత్త సినిమా విడుదలలు ఏమీ లేవు. శ్రీ విష్ణు స్వాగ్ సినిమా విడుదలైన.. ఆ సినిమా జూనియర్ ఎన్టీఆర్ దేవరని ఎఫక్ట్ చేసేలా కనిపించడం లేదు. ఈ క్రమంలో మరో వారం రోజుల పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర జోరు కొనసాగతం ఖాయంలా కనిపిస్తోంది.


Also Read: Udhayanidhi Stalin: పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం స్ట్రాంగ్ వార్నింగ్‌.. 'వెయిట్‌ అండ్‌ సీ' అని హెచ్చరిక


Also Read: Navratri 2024: దేవీ నవరాత్రుల్లో ఈ తప్పులు పొరపాటున కూడా చేయోద్దు.. పండితులు ఏమంటున్నారంటే..?..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter