Mahesh Babu మూవీలో అందాల నిధి Nidhhi Agerwal కి ఛాన్స్ ?
Nidhhi Agerwal in Mahesh Babu`s next film: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా పట్టాలెక్కనున్నట్టు ఇటీవలే ఓ ప్రకటన వెలువడటం, అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాను ప్రస్తుతానికి #SSMB28 గా ప్రకటించారు.
Nidhhi Agerwal in Mahesh Babu's next film: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా పట్టాలెక్కనున్నట్టు ఇటీవలే ఓ ప్రకటన వెలువడటం, అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాను ప్రస్తుతానికి #SSMB28 గా ప్రకటించారు. 11 ఏళ్ల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ మరోసారి కలిసి పనిచేస్తున్న సినిమా ఇది. వీళ్లిద్దరి కాంబోలో గతంలో మొదట 2005లో అతడు మూవీ, 2010లో ఖలేజా మూవీ వచ్చాయి. ఆ తర్వాత మళ్లీ మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్న మూడో సినిమా ఇది.
#SSMB28 మూవీలో మహేష్ బాబు సరసన ఇద్దరు హీరోయిన్స్‌కి అవకాశం ఉండగా ఇంకా ఎవ్వరి పేరు ఖరారు కాలేదు. ఇంకా అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు. మెయిన్ హీరోయిన్ ఎంపిక కోసం పూజా హెగ్డె, జాహ్నవి కపూర్, దిషా పటాని వంటి హీరోయిన్స్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు ఫిలింనగర్‌లో ఓ టాక్ వినిపిస్తోంది.
Also read : COVID-19: సినీ ఇండస్ట్రీలో విషాదం, కరోనాతో ప్రముఖ నటి కన్నుమూత
ఇదిలావుండగా తాజాగా ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ నిధి అగర్వాల్ పేరు కూడా ఈ సినిమా హీరోయిన్ కోసం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే నిధి అగర్వాల్‌ను మెయిన్ హీరోయిన్ కాకుండా సెకండ్ హీరోయిన్ కోసం ఎంపిక చేసుకున్నట్టు టాక్. మీడియాలో వస్తున్న ఈ వార్తలపై చిత్ర నిర్మాతలు స్పందించలేదు. నిధి అగర్వాల్ ప్రస్తుతం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సరసన హరి హర వీరమల్లు మూవీలో మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ మూవీ తర్వాత నిధి అగర్వాల్‌కి (Actress Nidhhi Agerwal) టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
#SSMB28 movie shooting త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే, రెగ్యులర్ షూటింగ్ మాత్రం మహేష్ బాబు సర్కారు వారి పాట మూవీ (Sarkaru Vaari Paata) షూటింగ్ ముగించుకున్న తర్వాతే ఉంటుందని సమాచారం. 2022 సమ్మర్ సీజన్ లో #SSMB28 movie విడుదల కానుంది.
Also read : Ravi Teja: మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ Khiladiకి కరోనా దెబ్బ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook