COVID-19: సినీ ఇండస్ట్రీలో విషాదం, కరోనాతో ప్రముఖ నటి కన్నుమూత

Actress Abhilasha Patil Passes Away Due To COVID-19: కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌లో మరింత ప్రభావాన్ని చూపుతోంది. మరింతగా రూపాంతరం చెందుతూ నిత్యం వేలాది మందిని బలిగొంటున్న కరోనా వైరస్ బాలీవుడ్ పరిశ్రమలో విషాదాన్ని నింపింది. చిచోరే ఫేమ్ అభిలాష పాటిల్ కరోనా బారిన పడి కన్నుమూశారు.

Written by - Shankar Dukanam | Last Updated : May 6, 2021, 01:28 PM IST
COVID-19: సినీ ఇండస్ట్రీలో విషాదం, కరోనాతో ప్రముఖ నటి కన్నుమూత

Abhilasha Patil Dies : కరోనా మహమ్మారి సామాన్యులతో పాటు పలు రంగాల సెలబ్రిటీలను మనకు దూరం చేసింది. తాజాగా మరోసారి హిందీ చిత్ర పరిశ్రమలో కరోనా మహమ్మారి విషాదాన్ని నింపింది. చిచోరే ఫేమ్, బాలీవుడ్ నటి అబిలాష పాటిల్ కరోనాతో కన్నుమూశారు. బాలీవుడ్ సినీ ప్రముఖులు ఆమె మరణం పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. 

బద్రీనాథ్ కి దుల్హానియా, గుడ్ న్యూస్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చిచోరే సహా పలు సూపర్ హిట్ బాలీవుడ్ సినిమాలలో అభిలాష పాటిల్ నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆమెకు కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో కోవిడ్19 పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. చికిత్స పొందుతూనే అభిలాష పాటిల్ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆమెను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో బాలీవుడ్ చిత్ర సీమ మరో సినీ సెలబ్రిటీని కోల్పోయింది. 

Also Read: Corona Third Wave: కరోనా థర్డ్ వేవ్ తప్పదు, ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలన్న నిపుణులు

అసిస్టెంట్ డైరెక్టర్ పరేష్ పాటిల్ ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అభిలాష పాటిల్ ఇకలేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. మిస్ యూ అంటూ ఆమె ఫొటో షేర్ చేశారు. నటి అభిలాష పాటిల్‌కు తల్లి, భర్త, ఓ కుమారుడు ఉన్నారు. హిందీ సినిమాలతో పాటు మరాఠీ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. 

Also Read: Anchor Pradeep Father Passed Away: కరోనాతో యాంకర్ ప్రదీప్ తండ్రి పాండురంగ మాచిరాజు కన్నుమూత  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News