Nidhi Agarwal Remuneration: భారీగా పెంచిన నిధి అగర్వాల్.. ఏకంగా రెండు రెట్లు..!!
హీరో సినిమాలో అశోక్ గల్లాకు జోడీగా నటించేందుకు నిధి అగర్వాల్ ఏకంగా కోటిన్నర అందుకున్నట్లుగా ఫిల్మ్ నగర్ టాక్. ఈ సమాచారం ప్రకారం నిధి పారితోషికం డబుల్ అయినట్టే.
Nidhhi Agerwal takes huge remuneration for Galla Ashok's Hero Movie: యువ సామ్రాట్ నాగ చైతన్య నటించిన 'సవ్యసాచి' సినిమాతో అందాల భామ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. సవ్యసాచి సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా నిధి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తన అందం, అభినయంతో కుర్రకారును ఆకట్టుకున్నారు. అఖిల్ నటించిన 'మిస్టర్ మజ్ను' సినిమాలో నటించి పర్లేదు అనిపించుకున్నారు. ఇక స్టార్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా నిధి క్రేజ్‌ను అమాంతం పెంచేసింది. ఈ సినిమాలో నటనతోనే కాదు గ్లామర్ పరంగానూ అలరించారు.
ఇస్మార్ట్ శంకర్ విజయం అనంతరం తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా.. తమిళ ఇండస్ట్రీలో నిధి అగర్వాల్ వరుస సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే స్టార్ హీరోలు జయం రవి, శింబు సరసన నటించారు. తాజాగా తెలుగులో 'సూపర్ స్టార్' మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా నటించిన 'హీరో' సినిమాలోనూ నిధి హీరోయిన్‌గా నటించారు. సంక్రాంతికి విడుదల అయిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ అందాల ప్రదర్శన చేశారు. అంతేకాదు ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.
'హీరో' సినిమాకు నిధి అగర్వాల్ భారీగా రెమ్యునరేషన్ (Nidhhi Agerwal Remuneration ) అందుకుందని సమాచారం తెలుస్తుంది. అందాల నిధి ఇప్పటి వరకు ఒక్కో సినిమాకు 50 లక్షల నుంచి 80 లక్షల మద్య పారితోషికం అందుకునేది. కాని హీరో సినిమాలో అశోక్ గల్లాకు జోడీగా నటించేందుకు ఈ అమ్మడు ఏకంగా కోటిన్నర అందుకున్నట్లుగా ఫిల్మ్ నగర్ టాక్. ఈ సమాచారం ప్రకారం నిధి పారితోషికం డబుల్ అయినట్టే. రానున్న సినిమాల్లో కూడా నిధి ఇంతే డిమాండ్ చేయనున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరి హర వీర మల్లు' సినిమాలో నిధి అగర్వాల్ నటిస్తున్నారు. మరో వైపు బాలీవుడ్ నుంచి కూడా సినిమాలు లైన్‌లో పెట్టాలని చూస్తున్నారట. ఇక కోలీవుడ్ స్టార్ హీరో శింబు (Simbu)తో నిధి అగర్వాల్ సహజీవనం (Nidhhi Agerwal In A Live-In Relationship) చేస్తున్నారని అక్కడి మీడియా కోడై కూస్తోంది. చెన్నైలో ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారని రూమర్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ బంధంపై వస్తోన్న పుకార్లకు పుల్‌స్టాప్ చెప్పాలనే భావనలో నిధి, శింబు ఉన్నారట. వీలైనంత త్వరగా వివాహం చేసుకోనున్నారని ప్రచారం కూడా సాగుతోంది. ఇందులో నిజం ఎంత ఉందో మరి. ప్రస్తుతం శింబుకి 38 ఏళ్లు కాగా.. నిధికి 28 ఏళ్లు.
Also Read: Kerala Lottery 12 Crore: గంటల వ్యవధిలోనే రూ.12 కోట్లు సంపాదించిన పెయింటర్.. ఎలానో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి