Kerala Lottery 12 Crore: గంటల వ్యవధిలోనే రూ.12 కోట్లు సంపాదించిన పెయింటర్.. ఎలానో తెలుసా?

Kerala Lottery 12 Crore: కేరళకు చెందిన ఓ 50 ఏళ్ల పెయింటర్ ను అదృష్టం వరించింది. లాటరీ రూపంలో ఏకంగా రూ.12 కోట్లను సదానందన్ అనే పెయింటర్ గెలుచుకున్నాడు. అయితే లాటరీ విజేతలను ప్రకటించే కొన్ని గంటల ముందే సదానందన్ ఆ టికెట్ కొనుగోలు చేయడం విశేషం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2022, 09:01 AM IST
    • కేరళలో ఓ పెయింటర్ ను వరించిన లాటరీ జాక్ పాట్
    • ఏకంగా రూ.12 కోట్లు గెలుచుకున్న సదానందన్
    • లాటరీ టికెట్ కొన్న గంటల్లోనే లాటరీ విజేతగా నిలవడం విశేషం
Kerala Lottery 12 Crore: గంటల వ్యవధిలోనే రూ.12 కోట్లు సంపాదించిన పెయింటర్.. ఎలానో తెలుసా?

Kerala Lottery 12 Crore: కేరళలోని కొట్టాయంకు చెందిన ఓ పెయింటింగ్ కార్మికుడ్ని అదృష్టం లాటరీ రూపంలో వరించింది. కొట్టాయంలోని అయ్​మాననం ప్రాంతానికి చెందిన సదానందన్.. క్రిస్మస్- న్యూఇయర్ సందర్భంగా నిర్వహించిన బంపర్ లాటరీలో రూ.12 కోట్లు గెలుచుకున్నాడు. ఆ లాటరీని కొన్న గంటల్లోనే అతడు రూ.12 కోట్లను గెలుచుకోవడం విశేషం. 

ఏం జరిగిందంటే?

సదానందన్ స్వస్థలం కేరళలోని కొట్టాయం కుడయంపాడి గ్రామం. ఆ ఊర్లో ఓ చిన్న ఇంట్లో నివసిస్తున్న సదానందన్.. 50 ఏళ్లుగా పెయింటర్ గా పనిచేస్తున్నాడు. బతకడానికి అనేక అప్పులు చేసిన క్రమంలో వాటిని తీర్చేందుకు ఓ లాటరీ టికెట్టు కొనాలని సదానందన్ నిర్ణయించుకున్నాడు. కొట్టాయంలోని బెంజ్ లాటరీస్ ఏజెన్సీకి చెందిన ఓ లాటరీ టికెట్ ను కొన్నాడు. 

అయితే ఆ లాటరీ విజేతలను ప్రకటించడానికి కొన్ని గంటల ముందే సదానందన్ ఆ టికెట్ కొనుగోలు చేయడం విశేషం. ఉదయం ఇంట్లోకి మాంసం కొనుగోలు చేసేందుకు బయటకు వచ్చిన సదానందన్.. అదే సమయంలో ఆ లాటరీ టికెట్ (నంబర్ XG 218582) కొన్నాడు. ఆ టికెట్ కొనుగోలు చేసి ఇంటికి వెళ్లిన కొన్ని గంటల్లోనే సదానందన్ రూ.12 కోట్లు గెలుచుకున్నాడని తెలిసింది. 

దీంతో తనకు అంతటి డబ్బు లాటరీ రూపంలో లభించడం వల్ల ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై పోయాడు సదానందన్. గత యాభై ఏళ్లుగా తాను పెయింటింగ్ వృత్తిలోనే ఉన్నట్లు తెలిపాడు. లాటరీలో వచ్చిన డబ్బును తన పిల్లల భవిష్యత్ కోసం ఉపయోగించుకుంటానని చెప్పాడు.

ఆ లాటరీలో మొదటి బహుమతిగాకు రూ.12 కోట్లు.. రెండో బహుమతిగా రూ.3 కోట్లు (ఆరుగురికి.. అంటే ఒక్కొక్కరికి రూ.50 లక్షలు).. అలాగే మూడో బహుమతిగా ఆరుగురికి రూ.10 లక్షలను అందజేయనున్నారు. లాటరీ ద్వారా నిర్వాహకులు రూ.47 లక్షలకు పైగా టికెట్లను విక్రయించినట్లు తెలుస్తోంది. 

Also Read: Pandit Birju Maharaj: ప్రముఖ కథక్ డ్యాన్సర్ పండిట్ బిర్జు మహారాజ్‌‌ కన్నుమూత

Also Read: Vaccination drive India: దేశంలో టీకా ప్రక్రియకు ఏడాది- ప్రధాని మోదీ ఏమన్నారంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News