Anaganaga Oka Raju Title Teaser: ఆ కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ కుళ్లుకొని సావాలిరా.. సోషల్ మీడియా పగిలిపోవాలి!!

'అనగనగా ఒక రాజు' అంటూ రిలీజ్‌ చేసిన వీడియోలో రాజు గాడి పెళ్లి అంటూ నవీన్‌ పొలిశెట్టి చేసే సందడి మాములుగా లేదు. తన డైలాగ్‌లు, ఆహార్యంతో నవ్వులు పంచుతున్నాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2022, 08:23 AM IST
  • 'అనగనగా ఒక రాజు' టైటిల్‌, టీజర్‌ ఔట్
  • ఆ కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ కుళ్లుకొని సావాలిరా
  • సోషల్ మీడియా పగిలిపోవాలి
Anaganaga Oka Raju Title Teaser: ఆ కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ కుళ్లుకొని సావాలిరా.. సోషల్ మీడియా పగిలిపోవాలి!!

Naveen Polishetty's Anaganaga Oka Raju First Look and Title Teaser is Out: 'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాతో యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) మంచి విజయాన్ని అందుకున్నాడు. మొదటి సినిమాలోనే తన మాట, యాసతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 'జాతి రత్నాలు' సినిమాతో ఫుల్ ఫేమస్ అయ్యాడు. ఆ సినిమాలో మనోడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఇటీవల పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటించిన 'రాధేశ‍్యామ్‌' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హోస్ట్‌గా వ్యవహరించి అందరిని ఆకట్టుకున్నాడు. స్టేజ్ మీద ఆయన చేసినా అల్లరి అంతాఇంతా కాదు.

తాజాగా నవీన్‌ పొలిశెట్టి హీరోగా కల్యాణ్‌ శంకర్ (Kalyan Shankar) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పోర్చ్యూన్‌ 4 సినిమాస్ సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం తమన్‌ అందిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌, టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 'అనగనగా ఒక రాజు' (Anaganaga Oka Raju) అంటూ రిలీజ్‌ చేసిన వీడియోలో రాజు గాడి పెళ్లి అంటూ నవీన్‌ పొలిశెట్టి చేసే సందడి మాములుగా లేదు. తన డైలాగ్‌లు, ఆహార్యంతో నవ్వులు పంచుతున్నాడు. 

Also Read: Rishabh Pant Test Captain: రోహిత్ శర్మ వద్దు.. టెస్ట్ కెప్టెన్‌గా రిషబ్ పంతే సరైనోడు: మాజీ క్రికెటర్

'నాయుడు గారు హనీమూన్‌కి హవాయికి టిక్కెట్లు బుక్ చేశారా లేదా.. డబ్బుల గురించి ఆలోచించకండి రాజుగాడి పెళ్లి ఇక్కడ' అనే డైలాగ్‌తో టీసర్ ఆరంభం అయి.. 'నేను చెప్పకూడదు కానీ.. ఈ డికెడ్‌లో అలరించే కార్యక్రమం ఇదే. థియేటర్లలో మీరే చూస్తారుగా' అనే డైలాగ్‌తో ముగుస్తుంది. 'ఇదేం విడ్డురం.. ఆడవాళ్లకేనా వడ్డాణం', 'మన పెళ్లి ఫొటోలు చూసి ఆ కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ కుళ్లుకొని సావాలిరా', 'పెళ్లి ఫొటోలతో సోషల్ మీడియా పగిలిపోవాలి' అనే డైలాగ్స్ అందరిని అలరించాయి. ప్రస్తుతం అనగనగా ఒక రాజు టీసర్ (Anaganaga Oka Raju Teaser) నెట్టింట వైరల్ అయింది. మీరు చూసి నవ్వేసుకోండి. 

Also Read: Gold Price: దేశంలో వివిధ నగరాల్లో నేటి బంగారం ధరలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News