Niharika Divorce: విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న నీహారిక, చైతన్య
Niharika Divorce: మెగా కుటుంబంలో విడాకుల కధ ప్రారంభమైంది. కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్న నీహారిక-చైతన్య దంపతులు విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Niharika Divorce: అందరూ అనుకున్నదే నిజమైంది. మెగా కుటుంబంలో ఆ ఇద్దరూ విడిపోయేందుకే నిర్ణయించుకున్నారు. అధికారికంగా విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టుకు అప్లై చేశారు. ఈ విషయాన్ని స్వయంగా జొన్నలగడ్డ చైతన్య ప్రకటించారు.
మెగా కుటుంబంలో నాగబాబు కుమార్తెగానే కాకుండా యాంకర్‌గా, నటిగా పేరు తెచ్చుకున్న నీహారిక గత కొద్దికాలంగా వార్తల్లో ఉంటోంది. కారణం ఆమె తన భర్త జొన్నలగడ్డ భర్తతో కలిసి ఉండకపోవడమే. ఇద్దరూ గత కొద్దికాలంగా విడివిడిగా ఉంటున్నారు. ముందు జొన్నలగడ్డ నీహారిక తన సోషల్ మీడీయా ఎక్కౌంట్ నుంచి నీహారిక ఫోటోలు డిలీట్ చేస్తే ఆ తరువాత నీహారిక భర్త పోటోలు డిలీట్ చేసింది. దాంతో అందరి అనుమానాలు నిజమయ్యాయి.
నీహారిక, చైతన్యలు ఇద్దరూ విడిగా ఉంటున్నారని, త్వరలో విడాకులు తీసుకుంటున్నారనే ప్రచారం ముమ్మరంగా సాగింది. ఇప్పుడు ఆ ప్రచారం నిజమేనని తేలింది. ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకునేందుకు ముందుకొచ్చారు. కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటీషన్ దాఖలు చేశారు. 2020లో ఈ ఇద్దరికీ వివాహమైంది. నీహారిక - చైతన్యల పెళ్లి రాజస్థాన్‌లోని జైపూర్ కోటలో అత్యంత ఘనంగా జరిగింది.
Also read: Anantha Sriram: సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ చుట్టూ వివాదం, వైఎస్సార్‌పై ట్రోలింగ్ చేసింది అతనేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook