Niharika Konidela: ప్రస్తుతం మన హీరోయిన్స్ కేవలం సినిమాలనే కాదు ఓటీటీల్లో కూడా అదరగొడుతున్నారు. అందులో డిఫరెంట్ కాన్సెప్ట్ ప్రోగ్రామ్‌లతో పాటు రియాలటీ షోలకు న్యాయ నిర్ణేయతులుగా వ్యవహరిస్తున్నారు. తెలుగులో ఎన్నో వినూత్న షోలతో పాటు సినిమాలతో అలరిస్తున్న ఆహాలో హిట్టైన షో 'చెఫ్ మంత్ర' ఒకటి. రెండు సీజన్లను కంప్లీట్ చేసుకున్న ఈ సో ఇపుడు మూడు సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సీజన్‌కు నిహారిక వ్యాఖ్యాతగా వ్యవహరించబోతుంది. ఈ సీజన్ మొదటి సీజన్‌కు శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరించింది. రెండో సీజన్‌కు మంచు లక్ష్మి రెండో సీజన్‌కు మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా చేసింది. తాజాగా మూడో సీజన్‌కు మాత్రం నిహారిక హోస్ట్ చేయనుంది. ఈ సీజన్ మరింత హిల్లేరియస్‌గా ప్లాన్ చేసారు మేకర్స్.ఈ సీజన్ మార్చి 8 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సీజన్ 8 ఎపిసోడ్స్‌గా రానుంది. ఇప్పటికే వ్యాఖ్యాతగా అలరించిన నిహారిక.. ఇపుడు వంటలక్క పాత్రలో నిహారిక కొణిదెల ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.



నిహారిక కొణిదెల గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. దాదాపు డజనుకు దగ్గరగా ఉన్న మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా అడుగు పెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ మధ్య చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకొంది. ఆ తర్వాత అతనికి విడాకుల ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచింది. నిహారిక కేవలం యాక్ట్రెస్‌గానే కాకుండా నిర్మాతగా వెబ్ సిరీస్ నిర్మిస్తోంది. అంతేకాదు సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లో నటించింది. ఇపుడు ఏకంగా ఓ ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా వ్యవహరింబోతుంది.


Also Read: Mallu Ravi: తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలం.. సంచలనం సృష్టించిన మల్లు రవి రాజీనామా


Also Read: Rs 500 Gas: మేడారంలో రేవంత్‌ రెడ్డి శుభవార్త.. రూ.500కే గ్యాస్‌, రుణమాఫీ ఎప్పటినుంచంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి