Nikhil Siddarth's 18 Pages Movie Twitter Review: కార్తికేయ 2తో పాన్ ఇండియా హిట్ కొట్టిన నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా 18పేజెస్ అనే సినిమా రూపొందింది. సుకుమార్ కథ అందించగా ఆయన శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన కుమారి 21ఎఫ్ సినిమా సూపర్ హిట్ కావడం అదే ఫార్మాట్లో ఈ సినిమాకి కూడా 18 పేజెస్ అనే పేరు పెట్టడంతో సినిమా మీద ఆసక్తి నెలకొంది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ల మీద ఈ సినిమాని బన్నీ వాసు నిర్మించగా ప్రపంచవ్యాప్తంగా 23వ తేదీ డిసెంబర్ అంటే ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. గోపి సుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకు వసంత్ సినిమాటోగ్రఫీ అందించారు. నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్స్ లో నటించగా దినేష్ తేజ్, అజయ్, పోసాని కృష్ణమురళీ, బ్రహ్మాజీ, సరయు వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు.



అక్టోబర్ 2020లో షూటింగ్ ప్రారంభంచబడిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక సినిమా ఎలా ఉంది అనే విషయం మీద పలువురు కామెంట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇదే రోజు రవితేజ ధమాకా సినిమా కూడా రిలీజ్ కావడంతో ఎక్కువ మంది ఆ సినిమా మీద ఆసక్తి చూపించారు. దీంతో 18 పేజెస్ సినిమాకి సంబంధించి పూర్తిస్థాయిలో ట్విట్టర్ రివ్యూ అయితే బయటికి రాలేదు కానీ సాయి ధరంతేజ్ వంటి వారు సినిమా బావుండాలని సినిమా యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్లు చేస్తున్న ట్వీట్లు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



వాస్తవానికి చెప్పాలంటే ఇప్పటివరకు ఒక్క 18 పేజెస్ రివ్యూ కూడా బయటకు రాలేదు. అందరూ కూడా సినిమా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ సినిమాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సినిమా బాగుంటుందని ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమంలో ఇలాంటి క్లైమాక్స్ ఉన్న సినిమా రాలేదని నిఖిల్ పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి ఇది ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకోబోతోంది అనేది.



Also Read: 18 Pages Movie: 18 పేజెస్ మూవీలో మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్.. టాలీవుడ్లో మొదటి సినిమాగా!


Also Read: Kalpika Ganesh Controversy: వివాదాలతో సావాసం.. పిలవని పేరంటానికి వెళ్లి హాట్ టాపిక్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.