18 Pages Movie: 18 పేజెస్ మూవీలో మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్.. టాలీవుడ్లో మొదటి సినిమాగా!

Nikhil Says 18 Pages Movie has a peculiar twist: 18 పేజెస్ సినిమాలో ఒక కీలక ట్విస్ట్ బయట పెట్టారు హీరో నిఖిల్, దానికి సంబందించిన వివరాల్లోకి వెళితే  

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 22, 2022, 09:37 PM IST
18 Pages Movie: 18 పేజెస్ మూవీలో మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్.. టాలీవుడ్లో మొదటి సినిమాగా!

Nikhil Says 18 Pages Movie has a peculiar twist: నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా 18 పేజెస్ అనే సినిమా రూపొందింది. డిసెంబర్ 23వ తేదీన అంటే రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి.

గతంలో సుకుమార్ అందించిన కథతో సూర్య ప్రతాప్ తెరకెక్కించిన కుమారి 21ఎఫ్ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ 18 పేజీస్ సినిమా మీద కూడా ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా సరిగ్గా విడుదలకు కొద్ది గంటల ముందు సినిమాకి సంబంధించి ఒక కీలక విషయాన్ని బయట పెట్టాడు హీరో నిఖిల్.

ఇది అన్ని లవ్ స్టోరీస్ లాంటి సినిమా కాదని ఈ సినిమాలో ట్విస్ట్ అదిరిపోతుందని చెప్పుకొచ్చాడు. సాధారణంగా సినిమాలను ప్రమోట్ చేసుకునే క్రమంలో హీరోలు దర్శకులు చేసే కామెంట్లే అయినా నిఖిల్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. సాధారణంగా తనకు ప్రేమ కథలు అంటే చాలా ఇష్టమని కానీ తాను అలాంటి ప్రేమ కథలతో సినిమా చేయాలంటే చాలా టెన్షన్ పడతానని నిఖిల్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

అయితే ఈ సినిమా ప్రేమ కథ అయిన అనేక ట్విస్టులతో మిస్టరీలతో కూడి ఉంటుందని సినిమా చూస్తున్న ప్రేక్షకులు అందరూ ఫీలవుతారని నిఖిల్ చెప్పుకొచ్చాడు. క్లైమాక్స్ హైలైట్ అని ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమలో ఇలాంటి క్లైమాక్స్ అయితే రాలేదని ఆయన పేర్కొన్నారు. ఇలా చెప్తుంటే సాడ్ ఎండింగ్ అనుకుంటారు కానీ సాడ్ ఎండింగ్ కాదని సినిమాకి హ్యాపీ ఎండింగ్ ఏ కానీ తెలుగు ప్రేక్షకులందరూ త్రిల్ ఫీల్ అవుతారని చెప్పుకొచ్చారు.
Also Read: Kalpika Ganesh Controversy: వివాదాలతో సావాసం.. పిలవని పేరంటానికి వెళ్లి హాట్ టాపిక్!

Also Read: Ravi Teja Dhamaka : చిన్నప్పటి నుంచి అంతే.. అది చిరంజీవే స్టార్ట్ చేశాడు.. రవితేజ కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 
 

Trending News