Nikhil Getting Father: కథకు ప్రాధాన్యమున్న సినిమాలు ఎంచుకుంటూ హిట్లతో దూసుకెళ్తున్న యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ ఇంట్లోకి కొత్త సభ్యులు రాబోతున్నారు. త్వరలోనే నిఖిల్‌ సతీమణి ఓ పండంటి పాపకు జన్మనివ్వనున్నారు. ఈ విషయాన్ని నిఖిల్‌ స్వయంగా 'ఎక్స్‌' వేదికగా పంచుకున్నారు. భార్య పల్లవి వర్మ గర్భం దాల్చడంతో ఇటీవల కుటుంబసభ్యులు సీమంతం వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరై నిఖిల్‌ దంపతులను దీవించారు. ఈ సీమంతం వేడుక ఫొటోలను నిఖిల్‌ పంచుకుంటూ ఓ పోస్టు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'భారత సంప్రదాయ వేడుక అయిన సీమంతం వేడుక నిర్వహించాం. మేం మొదటి బిడ్డకు జన్మనిస్తున్నామని చెప్పడానికి నేను, పల్లవి ఎంతో సంతోషిస్తున్నాం. మీరంతా ఆశీర్వాదం అందించాలని కోరుతున్నా' అని నిఖిల్‌ రాశారు. పల్లవి వర్మను 2020లో నిఖిల్‌ వివాహం చేసుకున్నాడు. 




తెలుగు సినీ పరిశ్రమలోకి 'హ్యాపిడేస్‌' సినిమాతో అరంగేట్రం చేసిన నిఖిల్‌ సిద్ధార్థ్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా స్థాయి హీరోగా ఎదిగాడు. కార్తికేయ-2 సినిమాతో నిఖిల్‌ దేశవ్యాప్త గుర్తింపు పొందాడు. కథలకు ప్రాధాన్యం ఇచ్చే నిఖిల్‌ ప్రస్తుతం రెండు సినిమాలు చేతిలో ఉన్నాయి. స్వయంభూ, ఇండియా హౌస్‌ అనే సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. చారిత్రక నేపథ్యంతో కూడిన స్వయంభూ సినిమాలో నిఖిల్‌ సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా కొన్ని నెలల పాటు యుద్ద విద్యలపై శిక్షణ కూడా పొందాడు.
 


Also Read: Jharkhand New CM: జార్ఖండ్‌లో క్షణక్షణం ఉత్కంఠ.. తదుపరి కొత్త ముఖ్యమంత్రి ఎవరో తెలుసా?


Also Read: YSRCP Ready To Election: వైసీపీ ఐదో జాబితాలో భారీ మార్పులు.. మాజీ మంత్రి అనిల్‌కు జాక్‌పాట్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook