Extra Ordinary Man - Nithiin: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithiin) సరైన హిట్ కొట్టి చాలా కాలామే అయింది. 2020లో భీష్మతో సాలిడ్ హిట్ అందుకున్న ఈ హీరో.. ఆ తర్వాత ఆ స్థాయిలో  బ్లాక్‍బాస్టర్ సాధించలేకపోయాడు. రంగ్‍దే పర్వాలేదనిపించినా.. గతేడాది రిలీజైన మాచర్ల నియోజకవర్గం ప్లాఫ్ అయింది. దీంతో కొంత గ్యాప్ తీసుకొని రచయిత, దర్శకుడు వక్కంతం వంశీతో మూవీకి ఓకే చెప్పాడు. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో విడుదల తేదీని కూడా ప్రకటించేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నితిన్ లేటెస్ట్ మూవీకి 'ఎక్స్ ట్రా ఆర్డనరీ మ్యాన్' (Extraordinary Man)నే టైటిల్‍ను ఖరారు చేసింది మూవీ యూనిట్. అంతేకాకుండా నితిన్ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో నితిన్ లుక్ కాస్త డిఫరెంట్‍గా ఉంది. ఇందులో నితిన్ రెండు రకాలుగా కనిపిస్తున్నాడు. గుబురు గడ్డం లుక్ తోపాటు మామూలుగానూ కనిపిస్తున్నాడు. దీని బట్టి చూస్తే ఇందులో డ్యూయల్ రోల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని క్రిస్మస్ కానుగా డిసెంబరు 23న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే క్రిస్మస్ బరిలో వెంకటేష్ సైంధవ్, నాని హాయ్ నాన్న ఉన్నాయి. 



Also Read: Bhola Shankar Trailer: చిరంజీవి 'భోళా శంకర్‌' ట్రైలర్‌ రిలీజ్ డేట్‌ ఫిక్స్.. ఎప్పుడంటే?


‘ఎక్స్‌ట్రా.. ఆర్డినరీ మ్యాన్’ చిత్రంలో నితిన్ జోడీగా తొలుత రష్మిక మందన్నాను ఎంచుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్టును తప్పుకుంది. దీంతో ఆమె స్థానంలో శ్రీలీల వచ్చింది. ఈ చిత్రానికి  స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హారీస్ జైరాజ్ సంగీతం అందించనున్నారు. ఈ మూవీని శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్& ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు.


Also Read: Rakul Preet Singh Pics: బికినీలో రకుల్ ప్రీత్ సింగ్ రచ్చ.. దుబాయ్‌లో ఢిల్లీ బ్యూటీ హాట్ షో



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook