Bhola Shankar Trailer: చిరంజీవి 'భోళా శంకర్‌' ట్రైలర్‌ రిలీజ్ డేట్‌ ఫిక్స్.. ఎప్పుడంటే?

Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న సినిమా 'భోళాశంకర్'. మరో మూడు వారాల్లో ఈ సినిమా అడియెన్స్ కు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 23, 2023, 04:15 PM IST
Bhola Shankar Trailer: చిరంజీవి 'భోళా శంకర్‌' ట్రైలర్‌ రిలీజ్ డేట్‌ ఫిక్స్.. ఎప్పుడంటే?

Bhola Shankar Movie Trailer:  వాల్తేరు వీరయ్యతో విజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు అదే ఊపులో భోళా శంకర్‌తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. తమిళ సినిమా వేదాళంకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్‌ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ అప్ డేట్ ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ చిత్ర ట్రైలర్ (Bhola Shankar Movie Trailer)ను జూలై 27న విడుదల చేయబోతున్నట్లు ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ లుక్ లో చేతిలో కత్తి పట్టుకుని మాస్‌ అవతారంలో చిరు కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్యాచ్ వర్క్ పూర్తి చేసుకుంటుంది. ఇక త్వరలోనే మూవీ ప్రమోషన్స్ కూడా షురూ చేయనున్నారు మేకర్స్. 

మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తోన్న ఈసినిమాలో చిరుకు జోడీగా మిల్క్ బ్యూటీ తమన్నా నటించింది. ఈ చిత్రంలో మెగాస్టార్ చెల్లెలిగా కీర్తి సురేష్ నటించగా.. మరో కీలకపాత్రలో సుశాంత్ కనిపించనున్నాడు. దాదాపు పది సంవత్సరాల తర్వాత దర్శకత్వం వహిస్తోన్న మెహర్ రమేశ్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసిగా పనిచేశాడు. ఈ మూవీ అన్నా, చెల్లి మధ్య ఉండే సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో చిరంజీవి టాక్సీ డ్రైవర్ కనిపిస్తారని టాక్. ఈ మూవీలో తులసి, రఘు బాబు, రావు రమేష్​, ఉత్తేజ్​, వెన్నెల కిశోర్​, మురళీ శర్మ తదితరులు ప్రధానపాత్రలు పోషించారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను ఆగస్టు 11న విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. 

Also Read: HBD Suriya: 'కంగువా' గ్లింప్స్ మామూలుగా లేదు భయ్యా.. ఇక సూర్య ఫ్యాన్స్ కు పండగే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News