Maestro trailer review: మాస్ట్రో ట్రైలర్ వచ్చేసింది. నితిన్, తమన్నా, నభా నటేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా హిందీలో విడుదలైన అంధాధున్ సినిమా ఆధారంగా తెరకెక్కిన తెలుగు రీమేక్ (Andhadhun telugu remake) అనే సంగతి తెలిసిందే. హిందీ వెర్షన్‌లో ఆయుష్మాన్ ఖురానా పోషించిన పాత్రను తెలుగు రీమేక్‌లో నితిన్ పోషించగా, సీనియర్ హీరోయిన్ టబు కనిపించిన పాత్రలో తమన్నా, గ్లామర్ బ్యూటీ రాధికా ఆప్టే పోషించిన పాత్రలో నభా నటేష్ (Actress Nabha Natesh) నటించారు. హిందీలో ఈ సినిమాను శ్రీరామ్ రాఘవన్ డైరెక్ట్ చేయగా.. తెలుగులో కృష్ణార్జున యుద్ధం ఫేమ్ మేర్లపాక గాంధీ రీమేక్ చేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వినాయక చవితి (Ganesh chaturthi 2021 date) సందర్భంగా సెప్టెంబర్ 10న మాస్ట్రో మూవీ రిలీజ్ అవుతుందని ఫిలింనగర్ వర్గాల టాక్. మరో విషయం ఏంటంటే.. మాస్ట్రో మూవీ థియేటర్లలో విడుదల కావడం లేదు. నేరుగా హాట్ స్టార్ ఓటిటి ప్లాట్ ఫామ్‌పైనే విడుదల కానుంది. అందుకే ప్రమోషన్స్‌లో భాగంగా నేడు హాట్ స్టార్ మాస్ట్రో ట్రైలర్‌ను విడుదల చేసింది. మాస్ట్రో ట్రైలర్ తెలుగు ఆడియెన్స్‌ని, నితిన్ అభిమానులను ఆకట్టుకుంటోంది.



Also read : Bigg Boss 5: బిగ్‌బాస్‌ 5 లో "జబర్దస్త్ వర్ష"...?? వైరల్ అవుతున్న కొత్త జాబితా!


నితిన్ (Nithiin) హోమ్ ప్రొడక్షన్స్ శ్రేష్ట్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి మాస్ట్రో మూవీని నిర్మించారు. అంధుడిగా నటిస్తున్న ఓ యువకుడు అనుకోకుండా ఓ హత్యకు సాక్షిగా నిలిస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయనే కథాకమామిషుతో మాస్ట్రో మూవీ తెరకెక్కింది. హిందీలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న అంధాధున్ మూవీని అచ్చం అదే కథతో ఈ సినిమాను రీమేక్ చేశారు. సస్పెన్స్, క్రైమ్, కామెడీ కలగలిసిన మాస్ట్రో మూవీ (Maestro movie) తెలుగు ఆడియెన్స్‌ని ఎలా ఆకట్టుకుంటుందో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచిచూడాల్సిందే.


Also read : Megastar Birthday Photos: కుటుంబంతో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook