Megastar Birthday Photos: కుటుంబంతో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు..

చిరంజీవి.... చిత్ర సీమకి పరిచయం అక్కరలేని పేరు... మూడు దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమని ఏలుతున్న రారాజు. చిత్ర సీమలో తన స్వశంకృషితో ఎదిగి ఇంత ఎత్తుకు చేరుకున్న చిరును చూసి చాలా మంది స్ఫూర్తి పొందుతుంటారు. 

  • Aug 23, 2021, 15:34 PM IST

నిన్న చిరంజీవి ఇంట్లో ఒకటి కాదు... రెండు పండగలు జరిగాయి, అటు రాఖీ పౌర్ణమి.. ఇటు చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పవన్ కళ్యాన్, రాంచరణ్, వరుణ్ తేజ్, ఇలా అందరితో కలిసి చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు, వాటిలోంచి కొన్ని ఫోటోలు మీ కోసం.... 

1 /6

పవన్ కళ్యాన్, నాగబాబు లకు అన్నయ్య అంటే ఎంత ప్రాణమో అందరికి తెలిసిందే... ఎంత పని ఉన్న, ఎక్కడ ఉన్న చిరు పుట్టిన రోజున ఇంటికి వచ్చి అన్నయ్యకు ఆత్మీయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతారు.  (Photo: Twitter)  

2 /6

రాంచరణ్ - చిరు... ఎలా ఉంటారో మనం ఎన్నో సార్లు ఆడియో రిలీజ్ ఫంక్షన్ లలో చూసిందే..  చిరుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్న కోడలు కొణిదెల ఉపాసన, కుమారుడు హీరో రాంచరణ్.  (Photo: Twitter)  

3 /6

ఇండస్ట్రీలో చిరు అంటే ఇష్టం లేని నటీ-నటులు ఉండరు.. అలాగే హీరో ప్రభాస్ కి కూడా చిరంజీవి అంతే చాలా ఇష్టం.. ఈ ఫోటోతో తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి చిరుకి శుభాకాంక్షలు తెలిపారు.  (Photo: Twitter)

4 /6

పెదనాన్న అంటే ఇష్టం ఉన్న వరుణ్ తేజ్... ఉదయాన్నే చిరు ఇంటికి వచ్చి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్న ఫోటో...    (Photo: Twitter)

5 /6

చిరంజీవికి అభిమానులు అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే.. పుట్టిన రోజు సందర్భంగా అభిమానులను కలవటానికి వచ్చిన చిరంజీవి ఆనందం చూడండి.  (Photo: Twitter)  

6 /6

చిరు అంటే ఇష్టం ఉన్న వాళ్లలో హీరో శ్రీకాంత్ కూడా ఒకరు.. ఎప్పుడు చిరు ఫ్యామిలీతో మమేకమై వారితో కలిసి పోతుంటాడు. చిరు పుట్టిన రోజు సందర్భంగా ఉదయాన్నే వచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు.  (Photo: Twitter)