Baby O Baby Lyrical Video Song: మాస్ట్రో నుంచి బేబీ ఓ బేబీ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్

Baby O Baby Lyrical Video Song: నితిన్ సరసన నభా నటేష్ జత కట్టింది. బాలీవుడ్ సక్సెస్‌ఫెల్ మూవీ అంధాదున్ కు రీమేక్‌గా తెలుగులో మాస్ట్రో తెరకెక్కుతోంది. శ్రీజో సాహిత్యం అందించిన బేబీ ఓ బేబీ సాంగ్ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 16, 2021, 04:53 PM IST
Baby O Baby Lyrical Video Song: మాస్ట్రో నుంచి బేబీ ఓ బేబీ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్

Baby O Baby Lyrical Video Song: టాలీవుడ్ నటుడు నితిన్ చెక్ మూవీ, రంగ్ దే తరువాత మొదలుపెట్టిన ప్రాజెక్ట్ మాస్ట్రో. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మాస్ట్రో మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్‌డేట్ అందించారు. బేబీ ఓ బేబీ లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది.

నితిన్ సరసన నభా నటేష్ జత కట్టింది. బాలీవుడ్ సక్సెస్‌ఫెల్ మూవీ అంధాదున్ కు రీమేక్‌గా తెలుగులో మాస్ట్రో (Actor Nithins Maestro Movie) తెరకెక్కుతోంది. కామెడీ థ్రిల్లర్ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా ఓ కీలకపాత్రలో కనిపించనుంది. భీష్మ మూవీతో నితిన్‌కు మ్యూజికల్ హిట్ అందించిన మహతి స్వర సాగర్ మాస్ట్రోకు స్వరాలు సమకూరుస్తున్నారు. శ్రీజో సాహిత్యం అందించిన బేబీ ఓ బేబీ సాంగ్ లిరికల్ వీడియో సాంగ్ (Baby O Baby Lyrical Video Song) రిలీజ్ చేశారు. అనురాగ్ కులకర్ణి అద్బుతంగా ఆలపించిన ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఆదిత్య మ్యూజిక్ ఈ సినిమా పాటల్ని అందిస్తోంది.

Also Read: RRR Movie Photos: డైరెక్టర్ SS Rajamouli ఆర్ఆర్ఆర్ మూవీ వర్కింగ్ స్టిల్స్ ట్రెండింగ్

శ్రేష్ట్ మూవీస్ పతాకంపై రాజ్‌కుమార్ ఆకేళ్ల సమర్పణలో నిఖితా రెడ్డి, ఎన్ సుధాకర్ రెడ్డి మాస్ట్రోను నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరగా పూర్తిచేసి సినిమాను విడుదల చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేసింది. నితిన్ అంధుడిగా నటించి ఏ తీరుగా మెప్పిస్తాడా అని టాలీవుడ్ (Tollywood) ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్‌లో చాలా సినిమాలు దసరా బరిలోకి దిగనున్నాయి. దాంతో కొన్ని సినిమాలు అంతకుముందే థియేటర్లలో సందడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: Narappa Trailer Out: విక్టరీ వెంకటేష్ నారప్ప ట్రైలర్ విడుదల, వెంకీ మాస్ యాక్షన్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News