Nithya Menen: పెళ్లి కాకుండానే గర్భవతైన నిత్యామీనన్… కారు నిండా గర్భవతులతో హల్చల్?
Nithya Menen Driving Car with Fake Pregnancy : గర్భవతి వేషధారణలో రోడ్డెక్కి కార్ డ్రైవ్ చేస్తూ నిత్య మీనన్ షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Nithya Menen Driving Car with Fake Pregnancy Video Goes Viral: మలయాళ హీరోయిన్ నిత్యామీనన్ తెలుగులో కూడా అనేక సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది. చివరిగా భీమ్లా నాయక్ అనే సినిమాలో కనిపించిన ఆమె ఈ మధ్య వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ హాట్ టాపిక్ గా మారుతుంది. అయితే ఈ మధ్యకాలంలో తాను ప్రెగ్నెంట్ అయ్యానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఒక్కసారిగా ఆమె కలకలం రేపింది.
ఆ తర్వాత అది ఆమె చేస్తున్న ఒక సినిమాకు కు సంబంధించిన ప్రమోషనల్ స్టంట్ అని తేలింది. అయితే ఈ మధ్యకాలంలో ఆమె తన గర్భంతో ఉన్నట్లు ఉన్న ఫోటోలను కూడా షేర్ చేస్తూ పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. ఆమెకు పెళ్లి కాకపోవడంతో ఈ విషయం మీద అనేక రకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. పెళ్లి కాకుండానే గర్భవతి అయిన నిత్యామీనన్, పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్ అనే టైటిల్స్ తో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆమె తాజాగా మరో వీడియో షేర్ చేసి షాక్ ఇచ్చింది.
ఆమె వండర్ ఉమెన్ అనే సినిమాలో నోరా అనే గర్భిణీ స్త్రీ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కి వెళుతూ ఉండగానే తాను గర్భంతో ఉన్నట్లు మేకప్ అయ్యి వెళ్తోంది అలా వెళుతూ ఉన్న సమయంలో తన కారులో మరో ముగ్గురు నటీమణులను కూడా ఎక్కించుకుంది. కారులో పాటలు వింటూ నలుగురు ప్రెగ్నెంట్ వుమన్ ఒకే కారులో వెళుతున్నప్పుడు మీరు ఎప్పుడైనా చూశారా అని చెబుతూ సదరు నటీమణులను కూడా ట్యాగ్ చేసి మేము షూటింగ్ కోసం లొకేషన్ కి వెళ్తున్నాం మమ్మల్ని ఇలా కారులో చూసిన వాళ్ళు ఎవరైనా షాక్ అవ్వాల్సిందే అంటూ నిత్య కామెంట్ చేసింది.
అయితే నటిస్తున్న సినిమాని ప్రమోట్ చేయడం బాగానే ఉంది కానీ ఇలా ఫేక్ గర్భాలతో రోడ్ ఎక్కితే నిజమైన గర్భవతులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సోషల్ మీడియా వేదికగా కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ చేయండి.
Also Read: Neha Sharma Pics: నేహా శర్మ బర్త్ డే స్పెషల్.. చిరుత భామ రేర్ హాట్ ఫొటోస్ చూసేయండి!
Also Read: Chiranjeevi: చిరంజీవికి అరుదైన గౌరవం.. ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022గా ఎంపిక!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook