Nivetha Thomas tested positive for COVID-19: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అప్‌కమింగ్ సినిమా వకీల్ సాబ్ ఏప్రిల్ 9న విడుదలయ్యేందుకు సిద్ధమవుతుండగా ఇంతలోనే ఈ సినిమాలో నటించిన నలుగురు హీరోయిన్స్‌లో ఒకరైన నివేదా థామస్‌కి కరోనావైరస్ సోకింది. కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవడంతో నివేధా థామస్ సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లింది. ఇప్పటివరకు వకీల్ సాబ్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న నివేదా థామస్‌తో టచ్‌లోకి వచ్చిన వాళ్లు కూడా క్వారంటైన్‌లోకి వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రోటోకాల్ ప్రకారం ఐసోలేట్ అయ్యానని, త్వరలోనే హెల్తీగా మీ ముందుకు వస్తానని అంటోంది నివేదా థామస్. తనకు ఎంతో మద్దతుగా నిలిచిన మెడికల్ టీమ్‌కి, తనని ఆదరించి అభిమానించే అభిమానులు అందరికీ నివేదా థామస్ కృతజ్ఞతలు తెలియజేసింది.


Also read : Vakeel Saab benefit shows: వకీల్ సాబ్ మూవీ బెనిఫిట్ షోలు ఉన్నట్టా లేనట్టా ?


వకీల్ సాబ్ మూవీలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సరసన శృతి హాసన్ జంటగా నటించగా.. కథపరంగా అంతకంటే ముఖ్యమైన పాత్రల్లో నివేదా థామస్ (Nivetha Thomas), అంజలి, అనన్య నాగళ్ల నటించారు. కరోనా కారణంగా నివేదా థామస్ వకీల్ సాబ్ డైరెక్ట్ ప్రమోషన్స్‌కి దూరమైనప్పటికీ.. సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్‌గా ఉండేలా నిర్మాతలు ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook