Vishwambhara Update: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసారా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న మల్లిడి వశిష్ట ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా అతి త్వరలోనే విడుదల కి సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర గ్లిమ్స్ వీడియోని కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఇక ఈ వీడియో చూస్తే ఈ సినిమా ఒక ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ తో వచ్చి ప్రేక్షకులను విపరీతంగా అలరించబోతోందని అర్థమవుతుంది.


ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ గురించి మరొక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల చల్ చేస్తుంది. ప్రస్తుతం చిరంజీవి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లోని అడవి సెట్ లో జరుగుతుంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చిరంజీవి ఈ షూటింగ్ షెడ్యూల్ కోసం బాడీ డబుల్ ను వాడటం లేదట. యాక్షన్ సన్నివేశాలలో కూడా ఆయన స్వయంగా షూట్లో పాల్గొంటున్నారట. 


మట్టిలో, నీళ్లలో కూడా జరిగే ఒక ఫైట్ సీన్ మొత్తం చిరంజీవి డూప్ లేకుండా చేస్తున్నారట. చిరంజీవి తో పాటు మిగతా ఫైటర్లు కూడా బురదలో మునిగి షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. ఇక సీన్స్ రియలిస్టిక్ గా రావడం కోసం చిత్ర బృందం నిజంగానే అక్కడ ఒరిజినల్ తడి మట్టి, ఇసుకను వాడినట్లు వినికిడి.


ఇక ఈ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని ఇదే సినిమాకి హైలైట్ కాబోతున్నాయని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో అద్భుతమైన కంప్యూటర్ గ్రాఫిక్స్ కూడా వాడబోతున్నారట. సినిమా విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయని టాక్ కూడా వినిపిస్తోంది.


Also Read: TamiliSai: "బాధగా ఉంది.. కానీ తప్పడం లేదు": రాజ్‌భవన్‌ ఖాళీ చేసిన తమిళిసై


Also Read: Kavitha: కవిత అరెస్ట్‌పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు.. ఘాటెక్కిన రాజకీయం



 


 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook