OTT Theatre Release : ప్రతీవారం కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. వెళ్తూనే ఉంటాయి. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అనే తేడా లేకుండా కంటెంట్ బేస్డ్ చిత్రాలు బాగానే ఆడుతున్నాయి. జనాలు థియేటర్లకు రావడానికి కూడా ఆలోచిస్తున్నారు. సినిమా బాగుందని అంటేనే బయటకు వస్తున్నారు. పెద్ద సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెడుతూనే.. మంచి చిత్రాలు బాగుంటే చూసేందుకు థియేటర్లకు వస్తున్నారు. ఈ వారం థియేటర్లోకి అన్నీ కూడా చిన్న చిత్రాలే వస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓటీటీలో మాత్రం పెద్ద సినిమాలు రాబోతోన్నాయి. చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా నెట్ ఫ్లిక్స్‌లో నవంబర్ 18న రాబోతోంది. ఈ చిత్రానికి మంచి టాకే వచ్చినా కలెక్షన్లు మాత్రం రాలేదు. మరి ఓటీటీ ఆడియెన్స్‌ను గాడ్ ఫాదర్ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక కార్తీ సర్దార్ సైతం నవంబర్ 18న రాబోతోంది. జీ5 యాప్‌లో రాజ్ తరుణ్ కొత్త సినిమా రాబోతోంది. అహనా పెళ్లంట అంటూ నవ్వులు పూయించేందుకు రాజ్ తరుణ్ సిద్దమయ్యాడు. మరి ఈ చిత్రం రాజ్ తరుణ్‌కు ఎలాంటి రిజల్ట్‌ను తెచ్చి పెడుతుందో చూడాలి.


థియేటర్లో అయితే ఈవారం అన్నీ చిన్న చిత్రాలే రాబోతోన్నాయి. మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న తిరువీర్.. మసూద సినిమాతో హీరోగా మారిపోయాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచాయి. సీనియర్ నటి సంగీత ఇందులో ముఖ్య పాత్రలో నటించింది. ఈ సినిమా నవంబర్ 18న రాబోతోంది. మరో వైపు సుడిగాలి సుధీర్ గాలోడు అంటూ థియేటర్లో సందడి చేయబోతోన్నాడు. మాస్ ఆడియెన్స్‌ను మెప్పించేందుకు సుధీర్ నవంబర్ 18న థియేటర్లోకి రాబోతోన్నాడు.


ఈ రెండు చిత్రాల మధ్యే పోటీ ఉండబోతోన్నట్టుగా కనిపిస్తోంది. తమిళ డబ్బింగ్ అయిన లవ్ టుడే కూడా నవంబర్ 18న రాబోతోంది. ఇక ఇవి కాకుండా.. అలిపిరికి అల్లంతదూరంలో, సీతారామపురంలో అంటూ రెండు చిన్న చిత్రాలు కూడా నవంబర్ 18న రాబోతోన్నాయి. వీటిలో ఏది సక్సెస్ అవుతుందో చూడాలి.


Also Read : Changes in SSMB 28: పంతం పట్టిన మహేష్.. దెబ్బకు కథ మొత్తం మార్చేసిన గురూజీ!


Also Read : Varshini Sounderajan Pics : పొట్టి గౌనులో యాంకర్ వర్షిణి.. అంతకు మించి అనేలా అందాల ప్రదర్శన


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook