NTR Birthday: కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ నేడు (మే 20) తన 39వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులతో పాటు తారక్ అభిమానులు కూడా ఇంటర్నెట్ లో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇటీవలే రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కలిసి నటించిన 'ఆర్ఆర్ఆర్' మూవీ విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే సినిమాలో స్నేహితుల్లా నటించిన చరణ్, తారక్ బయట కూడా అదే బంధాన్ని కొనసాగిస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత కూడా తమ స్నేహబంధం ఇలానే కొనసాగుతుందని ఇటీవలే చరణ్, తారక్ స్పష్టం చేశారు. 


అయితే మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. అందుకు సంబంధించిన కొన్ని పిక్స్ కూడా వైరల్ గా మారాయి. నేడు (మే 20) ఎన్టీఆర్ పుట్టినరోజు కారణంగా తారక్ కు రామ్ చరణ్ స్పెషల్ బర్త్ డే విషెస్ చెప్పారు. 



"సోదరుడు, సహనటుడు, స్నేహితుడు.. మీరు నాకు ఏమవుతారో చెప్పేందుకు ఒక్క పదం సరిపోదు. మన బంధం ఇప్పటికీ, ఎప్పటికీ ఉండాలని ఆశిస్తున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు" అని ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ ట్వీట్ చేశారు. దీంతో పాటు వీరిద్దరూ హత్తుకున్న ఓ ఫొటోను పంచుకున్నారు.  


Also Read: HBD NTR: హ్యాపీ బర్త్ డే తారక్... నేడు 39వ వడిలోకి జూనియర్ ఎన్టీఆర్.. ఆది నుంచి ఆర్ఆర్ఆర్ వరకు అన్‌స్టాపబుల్ స్టార్‌డమ్..


Also Read: OTT Streaming: మెగా అభిమానులకు పండగే..ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాలు ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook