NTR Fans in Tension Over NTR 30: జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు, దీంతో ప్రస్తుతానికి ఎన్టీఆర్ 30 అనే పేరుతో సంభోదిస్తున్నారు. అయితే ఈ సినిమాకి దేవర అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక పక్క ఎన్టీఆర్ అభిమానులు అందరూ టెన్షన్ పడుతున్నారు.  పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్న సినిమాకి దేవర అనే టైటిల్ ఏంటి అని మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా మరోపక్క పవన్ కళ్యాణ్ అభిమానులు కొరాటాల శివ అండ్ టీం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమ హీరోకి మాత్రమే అనుకున్న టైటిల్ ని ఎలా మీరు తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం తెరమీదకు వచ్చింది. అదేమిటంటే ఈ సినిమా కథ రామ్ చరణ్ రిజెక్ట్ చేసిందే అనే ప్రచారం జరుగుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కొరటాల శివ కాంబినేషన్ ఎప్పుడూ కుదరలేదు కానీ అనేకసార్లు ఆ ప్రయత్నాలు అయితే జరిగాయి. అలాంటి ఒక ప్రయత్నంలో భాగంగా రామ్ చరణ్ కు చెప్పగా అప్పుడు రిజెక్ట్ చేసిన కథనే ఇప్పుడు ఎన్టీఆర్ తో చేస్తున్నాడు అనే ప్రచారం జరుగుతోంది. కొరటాల శివ డైరెక్టర్గా లాంచ్ అయినప్పటి నుంచి రాంచరణ్ తో సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.


మిర్చి తర్వాత బండ్ల గణేష్ ప్రొడక్షన్ లో రామ్ చరణ్ హీరోగా కొరటాల శివ ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ సినిమా కథ మొత్తం నచ్చకపోవడంతో చరణ్ ఆ సినిమా చేయలేదు. తర్వాత మరోసారి చేయాలనుకున్న సమయంలోనే రామ్ చరణ్ కు ఆర్ఆర్ఆర్ ఆఫర్ రావడంతో అది వాయిదా పడింది. ఆ సమయంలోనే చిరంజీవి కొరటాల శివతో సినిమా చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే అదే సినిమాలో రామ్ చరణ్ ని కూడా నటింప చేయడం అది డిజాస్టర్ కావడంతో ఇప్పుడు కాస్త దూరం పెరిగినట్లు అయింది. ఇప్పుడు తాజాగా జరుగుతున్న ప్రచారం ఏమిటంటే ఈ ఎన్టీఆర్ తో కొరటాల శివ ప్రస్తుతం చేస్తున్న సినిమా విషయానికి వస్తే దీన్నే గతంలో రాంచరణ్ చేయను వద్దు అని చెప్పిన సినిమా అని అంటున్నారు.


ఆయన అలా చెప్పిన తర్వాత అదే కథను ఎన్టీఆర్ కి చెప్పగా ఎన్టీఆర్ ఓకే చేశారని ఓకే చేసిన తర్వాత కూడా అనేక మార్పులు చేర్పులు చేశారని టాక్ వినిపిస్తోంది. ఇక ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద కళ్యాణ్ రామ్, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ మీద కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచంద్ర సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సబు సీరిల్ ఆర్ డైరెక్టర్గా, రత్నవేలు డిఓపిగా వ్యవహరించనున్నారు ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు సినిమా లాంచింగ్ డేట్ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Also Read: Ariyana Glory Blasting Photos: బ్లాక్ టైట్ డ్రెస్ లో అరియానా గ్లోరీ వలపు వల.. కాక రేపేసిందిగా!


Also Read: Five Heorines in Yashoda: సమంత సహా 'యశోద'లో ఐదుగురు హీరోయిన్లు.. ఎవరెవరో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook