NTR - Prashanth Neel: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీకి ముహూర్తం ఖరారు.. ?
NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ఓకే చేస్తున్నారు. ఈ కోవలో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఎదురు చూస్తోన్న ప్రశాంత్ నీల్ మూవీ ఒకటి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ముహూర్తం ఖరారైనట్టు సమాచారం.
NTR - Prashanth Neel: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రాల్లో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ ఒకటి. ఎపుడో సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ సినిమా 'సలార్ -2 శౌర్యంగా పర్వం' కారణంగా లేట్ అయిది. తాజాగా ఈ సినిమా ఆగష్టు 9న శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్నట్టు సమాచారం. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే పేరు పరిశీలిస్తున్నారు. అంతేకాదు సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఎన్టీఆర్ విషయానికొస్తే.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కుతోంది. దేవర మొదటి పార్ట్ ఈ యేడాది అక్టోబర్ 10న విడుదల చేస్తున్నట్టు ముందుగ ప్రకటించారు. కానీ అనూహ్యంగా రెండు వారాల ముందుగానే సెప్టెంబర్ 27న సోలోగా ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన మొదటిపాటతో పాటు జాన్వీ కపూర్ తో చేసిన రొమాంటిక్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు అనిరుథ్ ఈ పాటను శ్రీలంక కు సంబంధించిన ఓ సినిమా పాటను కాపీ చేసినట్టు ఈ సినిమా ట్యూన్స్ చూస్తే తెలుస్తోంది. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమా ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జోడికి మంచి పేరు వచ్చింది.
మరోవైపు తారక్.. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో 'వార్ 2' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నాడు. నార్త్, సౌత్ కలయికలో వస్తోన్న భారీ మల్టీస్టారర్ మూవీపై అన్ని ఇండస్ట్రీస్ లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో ఆలియా భట్, కియారా అద్వానీ హీరోయిన్స్‌గా నటించడం దాదాపు ఖాయమైంది. ప్రస్తుతం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తూన్న సీన్స్ ను పిక్చరైజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ నెలాఖరు వరకు ఈ సినిమా షూటింగ్ ను ఎన్టీఆర్ పూర్తి చేయనున్నట్టు సమాచారం.
అటు ‘వార్ 2’ చేస్తూనే.. సెప్టెంబర్ నుంచి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలైయ్యాయి. ఈ సినిమాను పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఇక ఎన్టీఆర్ నటిస్తోన్న 'దేవర' మూవీ విషయానికొస్తే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపుల్ రోల్లో యాక్ట్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక 'దేవర' రెండో పార్ట్‌ను 2025 సమ్మర్‌లో విడుదల చేయాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. అటు 'వార్ 2' మూవీని 2025 రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. అది కుదరకుంటే 2025 ఆగష్టు 15న విడుదలనేది టార్గెట్.
ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
మొత్తంగా ఎన్టీఆర్.. ఎలాంటి ఈగోలకు పోకుండా మల్టీస్టారర్ మూవీస్ చేయడానికి ముందుకు రావడం ఆహ్వానించదగ్గ పరిణామం. వార్ 2 తర్వాత మరో బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్ భాగం కాబోతున్నట్టు సమాచారం.వార్ 2 కంప్లీట్ కాగానే.. వార్ 3 లో కూడా నటించబోతున్నట్టు సమాచారం. అటు పఠాన్ 2, టైగర్ వర్సెస్ పఠాన్ మూవీల్లో కూడా ఎన్టీఆర్ యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. మరోవైపు జవాన్ డైరెక్టర్ అట్లీతో పాటు కల్కి ఫేమ్ నాగ్ అశ్విన్‌లతో ఎన్టీఆర్ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది.