NTR on remake: తండ్రి సినిమా రీమేక్‌కు ఓకే చెప్పిన ఎన్టీఆర్.. ఆ డైలాగ్ ఉండాల్సిందేనట!
NTR on remake: తన తండ్రి సినిమాలను రీమేక్ చేసేందుకు సిద్ధమని ఎన్టీఆర్. అయితే ఇందుకు తానకు కొన్ని కండీషన్స్ ఉన్నాయని చెప్పారు. ఇంతకి ఆ సినిమా ఏది? రీమేక్ గురించిన ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఆ వివరాలు చూద్దామిప్పుడు.
NTR on remake: ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ మరోసారి హాట్ టాపిగ్గా మారాయి. తన తండ్రి నటించిన సినిమాల్లో ఒక మూవీని రీమేక్ చేసేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు తారక్. అందుకు అవకాశమొస్తే తాను సిద్ధమేనని వివరించారు.
ఏ సినిమా గురించి చర్చంటే..
ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటించిన 'ఆర్ఆర్ఆర్' మూవీ ఈ నెల 25న థియేటర్లలో విడుదల కానుంది. ఇందుకోసం సినిమా ప్రమోషనస్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆర్ఆర్ఆర్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి వ్యాఖ్యాతగా.. ఎన్టీఆర్, రామ్ చరణ్లుతో స్పెషల్ చిట్ చాట్ చేశారు.
ఇందులో 'ఆర్ఆర్ఆర్' మూవీ గురించి, పలు ఇతర ఆసక్తికర విషయాల గురించి చర్చించారు. ఓ సందర్భంలో ఎన్టీఆర్‌ను ఉద్దేశిస్తూ కీరవాణి.. 'మీ నాన్నగారి సినిమాల్లో సీతయ్య సినిమాను రీమేక్ చేస్తావా' అని అడిగారు.
ఈ ప్రశ్నకు సమాధానంగా తప్పకుండా చేస్తాన్నారు ఎన్టీఆర్. అయితే ఆ సినిమా చేయాలంటే కొన్ని కండీషన్స్ పెట్టారు. ఆ సినిమాకు కీరవాణి సంగీతమందించాలని కండీషన్ పెట్టారు. అంతే కాదు.. సీతయ్యలో ఫేమస్ డైలాగ్ ('వినపడదు, వినలేదు, వినడు') తప్పకుండా ఉండాలన్నారు.
ఇక సీతయ్య సినిమాలో తనకు నచ్చిన పాట, సీన్ల గురించి చెప్పారు ఎన్టీఆర్. కీరవాణి కూడా ఆ సినిమాకు సంబంధించిన విషయాలను ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పంచుకున్నారు. చిరంజీవి, హరికృష్ణల మధ్య చాలా మంచి అనుబంధముండేదని గుర్తు చేసుకున్నారు.
Also read: Rashi Khanna: కావాలనుకున్నది మరొకటి.. అయ్యింది ఒకటి: రాశీ ఖన్నా
Also read: RRR Movie: ఆర్ఆర్ఆర్ యూనిట్ వాడకం మాములుగా లేదుగా.. 'స్టాచ్యు ఆఫ్ యూనిటీ' వద్ద మొదటి సినిమా మనదే!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook