NTR Upcoming Movies: ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్లోనే కాక.. వరల్డ్ సినీ ఇండస్ట్రీలోని అత్యధిక మార్కెట్ కలిగిన హీరోలలో ఒకరిగా.. గుర్తింపు తెచ్చుకున్నాడు. బాహుబలి తర్వాత అతను చేసే అన్ని.. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్.. ఓ రేంజ్ యూనివర్సల్ స్టోరీస్ తోనే తెరకెక్కుతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఐదు భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్టులో లైన్లో పెట్టి.. తన సత్తా చాటుతున్నాడు డార్లింగ్. వీటిలో చాలావరకు సీక్వెల్ చిత్రాలు కావడం.. మొదటి భాగాలు.. భారీ విజయాన్ని అందుకోవడం లాంటి కారణాలవల్ల ఇండస్ట్రీలో ప్రభాస్ రానున్న సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీక్వెల్స్ విషయం పక్కన పెడితే..వచ్చే ఏడాది సమ్మర్ కి.. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ మూవీలో.. మొదటిసారి ప్రభాస్ హారర్ కామెడీ ట్రై చేస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన ప్రభాస్ వింటేజ్ లుక్స్..చిత్రంపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ చిత్రం తరువాత..ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్న మరో భారీ ప్రాజెక్ట్..ఫౌజీ మూవీ కూడా త్వరలో సెట్స్ పైకి రాబోతుంది.


రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే ప్రేమకథతో ఈ మూవీ.. తెరకెక్కించబోతున్నారంట. ఈ మూవీ తో పాటు యానిమల్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా.. దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న స్పిరిట్ మూవీ ఈ ఏడాదిలోనే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. 


ఇక ప్రభాస్ సినిమాలు కాసేపు పక్కన పెడితే..మరో వైపు ప్రశాంత్ నీల్.. జూనియర్ ఎన్టీఆర్ తో ఓ పవర్ఫుల్ మూవీ చేయబోతున్నారు. మాఫియా బ్యాక్ డ్రాప్ సాగే.. ఈ డ్రాగన్ స్టోరీ కోసం.. నీల్ చాలా స్ట్రాంగ్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారని టాక్. ఈ మూవీ లో ఎన్టీఆర్ పాత్ర.. ఇంతకుముందు వాటితో పోల్చుకుంటే చాలా భిన్నంగా ఉంటుందట.


ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్.. 2026 జనవరి 9న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. అంటే ఈ మూవీ 
2026 సంక్రాంతి.. కానుకగా రానుందని అర్ధమవుతోంది. ఎన్టీఆర్ ,ప్రశాంత్ నీల్ కాంబో కాబట్టి ..మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ స్పిరిట్ మూవీ, ఎన్టీఆర్ డ్రాగన్ కు మధ్య 2026 సంక్రాంతికి..టఫ్ ఫైట్ ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. స్పిరిట్ సందీప్ రెడ్డివంగా ముందుగానే 2026 సంక్రాంతికి విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రభాస్ కి.. షాక్ ఇస్తోంది. 


ఒకవేళ ఇదే జరిగితే థియేటర్లలో.. కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం పడక ఆగదు. కాబట్టి ఎవరో ఒకరు వెనక్కి తగ్గే ఛాన్స్ ఉంటుంది. అలా కాదు సంక్రాంతి సెలవల్ని.. ఉపయోగించుకోవాలి అనుకుంటే మాత్రం పోటీ తప్పదు అంటున్నారు ట్రేడ్ పండితులు.


Also Read: KTR Jail: అవినీతి కేసులో కేటీఆర్‌ జైలుకు ఖాయం: బండి సంజయ్ వ్యాఖ్యలతో కలకలం


Also Read: KTR Emotinal: జైలులో కవిత దుర్భరంగా ఉంది.. ఆమె ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్‌ ఆవేదన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter