NTR’s voice over in Kalyan Ram’s Bimbisara: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న బింబిసార మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడుతుండగా తాజాగా వినిపిస్తున్న మరో అప్‌డేట్ నందమూరి అభిమానుల్లో సినిమాపై హైప్‌ను మరింత పెంచింది. అదేంటంటే.. అన్నయ్య కళ్యాణ్ రామ్ బార్బేరియన్ కింగ్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు తారక్ వాయిస్ ఓవర్ అందించనున్నట్టు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విభిన్నమైన కథనం, నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమాగా బింబిసార మూవీని ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకు తగినట్టుగానే సినిమాలో కథా నేపథ్యం గురించి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో సినిమా ఇంట్రాడక్షన్, ఎంట్రీ సీన్స్ వంటివి ఉండనున్నాయని ఫిలింనగర్ టాక్. పౌరాణికం పాత్రల్లో తన స్వరంతో అదరగొట్టే ఎన్టీఆర్ వాయిస్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని తారక్ ఫ్యాన్స్ (NTR fans) భావిస్తున్నారు.  


ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్న బింబిసార మూవీని (Kalyan Ram in Bimbisara movie) మల్లిడి వశిష్ట్ డైరెక్ట్ చేస్తున్నాడు. క్యాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. చిరంతన్ భట్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇప్పటికే 70% బింబిసార మూవీ షూటింగ్ కూడా పూర్తయ్యింది. కరోనా కారణంగా మిగతా షూటింగ్‌కి బ్రేక్ పడింది. ఎంత మంచి వాడవురా మూవీ తర్వాత మళ్లీ కళ్యాణ్ రామ్ చేస్తున్న సినిమా ఇదే.