Old lady on Jr NTR: నువ్వు ఉంటే ఏంటి? చస్తే ఏంటి? ఎన్టీఆర్ పై వృద్ధురాలు షాకింగ్ కామెంట్స్!
Old lady in Amaravathi padayatra Made Sensational Comments on Jr NTR: అమరావతి ఏకైక రాజధాని కోసం పాదయాత్ర చేస్తున్న వారిలో ఒక వృద్ధ మహిళ జూనియర్ ఎన్టీఆర్ మీద దారుణ వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే
Old lady in Amaravathi padayatra Made Sensational Comments on Jr NTR: కొన్నాళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారం ఇంకా హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది. తాజాగా ఈ విషయం మీద అమరావతి పాదయాత్రలో పాల్గొంటున్న ఒక వృద్ధ మహిళ సంచలన వ్యాఖ్యలు చేసింది. అమరావతిని రాజధాని చేయాలని రైతులు చేస్తున్న పాదయాత్రలో ఓ మహిళ యంగ్ టైగర్ ఎన్టీఆర్ను బూతులు తిట్టిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
'ఎన్టీఆర్ మనవడిని అని చెప్పుకుంటాడు. నువ్వు ఎన్టీఆర్ మనవడివైతే.. రా ముందుకు రా. మీ తాతని అవమానిచ్చినప్పుడు.. నువ్వు ఎందుకు బయటకీ రావు, అలా రానప్పుడు ఇక నువ్వు ఉంటే ఏంటి? చస్తే ఏంటి? మేమే లాక్కొస్తాం టీడీపీని' అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. నిజానికి పేరు మార్పు వ్యవహారం మీద ఎన్టీఆర్ కాస్త కర్ర విరగకుండా పాము చావకుండా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ పేరు మార్చి వైయస్సార్ పేరు పెట్టడాన్ని ఆయన ఖండించకపోగా ఒకరి పేరు మార్చి మరొకరి పేరు పెడితే ఒకరు గౌరవం తగ్గదు మరొకరికి గౌరవం పెరగదు అంటూ కామెంట్ చేశారు.
అయితే ఈ విషయం మాత్రం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఏమాత్రం రుచించలేదు. ఎందుకంటే వాళ్లు ఎన్టీఆర్ నుంచి ఘాటు కౌంటర్లు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఎన్టీఆర్ చాలా సైలెంట్ గా తప్పేముంది అనే విధంగా కామెంట్ చేయడంతో జూనియర్ ఎన్టీఆర్ మీద తీవ్రస్థాయిలో టీడీపీ అభిమానులు విరుచుకుపడ్డారు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎన్టీఆర్ కాళ్ల వద్ద నారా కుటుంబ సభ్యులు కుక్కలు లాంటి వాళ్ళు అంటూ ట్రెండ్ చేసిన పరిస్థితి కనిపించింది.
ఇక ఆ వ్యవహారం సద్దుమణిగింది అనుకుంటున్న సమయంలో ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ ను పాదయాత్ర చేస్తున్న వృద్ధ మహిళ కామెంట్ చేయడం హాట్ టాపిక్గా మారింది. మరి ఈ విషయం మీద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎలా స్పందిస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన తరువాతి సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నారు.
ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వెలువడింది కానీ ఎప్పటినుంచి షూటింగ్ మొదలవుతుందనే విషయం మీద ఇప్పటివరకు సరైన క్లారిటీ లేదు. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నెలాఖారు నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని అయితే అంటున్నారు. ఇక కళ్యాణ్ రామ్ కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read: Kantara Telugu Trailer: సత్తా చాటిన కన్నడ కంటార ఇక తెలుగులో.. 15న రిలీజ్.. ట్రైలర్ చూస్తే మెంటలే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook