Viral Video: RRR `నాటు నాటు` పాటకు బామ్మ డ్యాన్స్.. ఎనర్జీకి ఫిదా అవుతున్న నెటిజన్లు
`ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా నుండి విడుదలైన `నాటు నాటు` సాంగ్ ఎంత హిట్ అయిందో తెలుసు.. మరీ అంత ఊపున్న పాటకు ఒక బామ్మ డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది.. ?? నమ్మట్లేదా అయితే వీడియో మీరే చూసేయండి!
Old Women Dancing on RRR Naatu Naatu Song: 'ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) సినిమాలోని 'నాటు నాటు'’ (Naatu Naatu Song) పాట విడుదలైన సంగతి తెలిసిందే.. రామ్‌చరణ్, ఎన్టీఆర్..మాస్ స్టెప్పులతో అలరించటం.. యూట్యూబ్ ను షేక్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే.. అయితే యూట్యూబ్ లో వీడియో పోస్ట్ చేస్తే సాధారణంగా ఫ్యాన్స్, యూట్యూబర్స్ కామెంట్స్ చేస్తుంటారు.. కానీ 'ఆర్‌ఆర్‌ఆర్' (RRR) సినిమాలోని 'నాటు నాటు' పాటకు యూట్యూబ్ కూడా కామెంట్ చేయటం విశేషం.
'నా పాట సూడు.. నా పాట సూడు.. వీర నాటు నాటు...' అంటూ సాగే ఈ సాంగ్‌లో రామ్‌చరణ్, ఎన్టీఆర్ (Ramcharan-NTR) స్టెప్పులు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ గీతానికి కీరవాణి స్వరాలు అందించగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించారు. ఇప్పటికే విడుదలైన తొలి గీతం ‘దోస్తీ’కి విశేష స్పందన లభించింది.
Also Read: Flex Fuel Engines: గుడ్ న్యూస్..తగ్గనున్న పెట్రో-డీజిల్ ధరలు..లీటర్‌కు రూ.62: నితిన్ గడ్కరీ
అయితే ఇపుడు మరొక వీడియో ఫుల్ గా ట్రెండ్ అవుతుంది... అది కూడా ఒక బామ్మ 'ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) సినిమాలోని 'నాటు నాటు'’ డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఎన్టీఆర్, చరణ్ చేసిన స్టెప్పులను రిపీట్ చేయటమే కాకుండా, ఏ మాత్రం అలసిపోకుండా.. అచ్చం అలానే డ్యాన్స్ చేయటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ఈ వీడియోని RRR చిత్ర బృందం అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా..
ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఈ వయసులో బామ్మకి ఇంత ఉత్సాహాం ఏంటి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు... మరి ఈ బామ్మ స్టెప్పులు నచ్చాయో లేదో మీరే చూసి చెప్పండి మరీ!
దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. రామ్‌చరణ్ (Ram Charan) అల్లూరి సీతారామరాజుగా (Alluri Sitaramaraju), ఎన్టీఆర్ (NTR) కొమురం భీమ్‌గా (Komaram Bheem)సందడి చేయనున్నారు. ఆలియా భట్, శ్రియ, సముద్రఖని, ఒలివియా మోరిస్, అజయ్ దేవ్‌గణ్ కీలకపాత్రలు పోషించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి