RRR Movie Postponed: ఆర్ఆర్ఆర్ సినిమాపై ఒమిక్రాన్ ప్రభావం, వాయిదాపై ఇవాళే నిర్ణయం
RRR Movie Postponed: కరోనా మహమ్మారి వరుసగా రెండవ ఏడాది కూడా సినిమాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈసారి ఒమిక్రాన్ ముప్పు వెంటాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై ఒమిక్రాన్ ప్రభావం పడనుందనే తెలుస్తోంది. ఇవాళ ఆ చిత్రానికి సంబంధించి కీలకమైన అప్ డేట్ వెలువడనుంది.
RRR Movie Postponed: కరోనా మహమ్మారి వరుసగా రెండవ ఏడాది కూడా సినిమాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈసారి ఒమిక్రాన్ ముప్పు వెంటాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై ఒమిక్రాన్ ప్రభావం పడనుందనే తెలుస్తోంది. ఇవాళ ఆ చిత్రానికి సంబంధించి కీలకమైన అప్ డేట్ వెలువడనుంది.
నూతన సంవత్సరం వేళ అందరి చూపూ కొత్త సినిమాలపై పడింది. ఎందుకంటే చాలాకాలంగా ఎదురుచూస్తున్న భారీ సినిమాలు ఈ ఏడాదిలో విడుదల కానున్నాయి. ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఇందులో ముఖ్యమైంది. జనవరి 7వ విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ ..పరిస్థితి మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఒమిక్రాన్ ప్రభావం ఆ సినిమాపై తీవ్రంగా పడనుందని తెలుస్తోంది. ఎందుకంటే ఒమిక్రాన్ ముప్పు నేపద్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ప్యూతో పాటు ధియేటర్లలో 50 శాతం ఆక్సుపెన్సీ, ఇతర ఆంక్షలు విధించారు. కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ (Lockdown)దిశగా ఆలోచన చేస్తున్నాయి. వాస్తవానికి ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడవచ్చని ముందే ఊహించినా..నిర్ణయించిన తేదీనే విడుదలవుతుందని రాజమౌళి చెప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే అప్పటికీ ఇప్పటికీ పరిస్థితి మారింది. మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబైలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. అటు ఢిల్లీలో కూడా అదే పరిస్థితి. ఈ నేపధ్యంలో ముందుగా నిర్ణయించుకున్నట్టు జనవరి 7న విడుదల చేస్తే..సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడనుంది.
ఎందుకంటే గతంలో ఎన్నడూ లేనంతగా భారీగా ఆర్ఆర్ఆర్ సినిమా (RRR Movie) ప్రమోషన్లు జరుగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో పెద్దఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రం కావడం, రామ్ చరణ్-జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో కన్పించనుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మహారా, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండటమే కాకుండా ధియేటర్లలో 50 శాతమే అనుమతి ఉంది.
ఈ పరిస్థితుల్లో సినిమా విడుదలైతే అది కచ్తితంగా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపనుందని అంచనా. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ సినిమాను వాయిదా వేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 2022 వేసవికి సినిమా వాయిదా వేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
Also read: Deepthi Breakup with Shanmukh: షణ్ముఖ్‌కు బ్రేకప్ చెప్పేసిన దీప్తి సునైనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి