Deepthi Breakup with Shanmukh: షణ్ముఖ్‌కు బ్రేకప్ చెప్పేసిన దీప్తి సునైనా

Deepthi Breakup with Shanmukh: శృతి మించితే ఏదైనా అంతే. పరిధి దాటి వ్యవహరించి ఫ్రెండ్‌షిప్ అంటే ఎలా కుదురుతుంది మరి. అదే జరిగింది. బిగ్‌బాస్ కంటెస్టెంట్ షణ్ముఖ్‌కు దీప్తి సునైనా బ్రేకప్ చెప్పేసింది. అసలేం జరిగింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 1, 2022, 09:52 AM IST
Deepthi Breakup with Shanmukh: షణ్ముఖ్‌కు బ్రేకప్ చెప్పేసిన దీప్తి సునైనా

Deepthi Breakup with Shanmukh: శృతి మించితే ఏదైనా అంతే. పరిధి దాటి వ్యవహరించి ఫ్రెండ్‌షిప్ అంటే ఎలా కుదురుతుంది మరి. అదే జరిగింది. బిగ్‌బాస్ కంటెస్టెంట్ షణ్ముఖ్‌కు దీప్తి సునైనా బ్రేకప్ చెప్పేసింది. అసలేం జరిగింది.

బిగ్‌బాస్ సీజన్ 5 తెలుగు ముగిసిపోయింది. అయితా ఆ బిగ్‌బాస్ హౌస్‌లో జరిగిన పలు పరిణామాలు రెండు జంటల్ని విడదీసే పరిస్థితికి చేర్చాయి. ఎందుకంటే బిగ్‌బాస్ కంటెస్టెంట్లుగా ఉన్న షణ్ముఖ్‌కు ముందుగానే దీప్తి సునైనాతో (Deepthi Sunaina) నిశ్చయమైంది. అటు సిరికి అంతకముందే శ్రీహాన్‌తో నిశ్చయమైంది. అయితే బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చాక..సిరి, షణ్ముఖ్ మధ్య ఏర్పడిన బంధం పలు పరిణామాలకు దారి తీసింది. తమ మధ్య ఉన్నది ఫ్రెండ్‌షిప్ మాత్రమేనని బయటకు ఎంతగా చెబుతున్నా..లోపల జరిగిన పరిణామాలు వేరే అర్ధాలకు దారీ తీశాయి. అవసరమున్నా లేకపోయినా...ప్రతి దానికీ అదే పనిగా ఇద్దరూ హగ్‌లు ఇచ్చుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, పరిధి దాటి సన్నిహితంగా ఉండటం దేనికి సంకేతమనే విమర్శలు పెద్దఎత్తున చెలరేగాయి. ఎంత ఫ్రెండ్‌షిప్ అయినా..అంతగా హగ్‌లు ఇచ్చుకోవాలా అనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓ విధంగా బిగ్‌బాస్ హౌస్ పోటీలో షణ్ముఖ్, సిరిల క్రేజ్ చివరికొచ్చేసిరికి తగ్గిపోవడానికి కారణం కూడా ఇదే. 

బిగ్‌బాస్ హౌస్‌లో (BiggBoss House) ఈ ఇద్దరి వైఖరి కచ్చితంగా ఆ రెండు జంటల్ని విడదీస్తుందనే ప్రచారం సాగింది. ఊహించిందే జరిగింది. సిరి (Siri) వర్సెస్ శ్రీహాన్ వ్యవహారంపై ఇంకా స్పష్టత రాకపోయినా..షణ్ముఖ్ వర్సెస్ దీప్తి సునైనా జంట మాత్రం విడిపోయింది. కొత్త సంవత్సరం కానుకగా బ్రేకప్ చెప్పేసింది దీప్తి సునైనా. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా సాక్షిగా ప్రకటిస్తూ లవ్ బ్రేకప్‌తో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సుదీర్ఘమైన పోస్ట పెట్టింది దీప్తి సునైనా. తెగదెంపుల గురించి ప్రకటించింది. 

చాలా ఆలోచించి..ఇద్దరూ పరస్పరం మాట్లాడుకున్న తరువాత ఈ నిర్మయం తీసుకున్నాం. షణ్ముఖ్ (Shanmukh), నేను ఒకరికొకరు అంగీకారంతో విడిపోయి..ఇండివిడ్యువల్‌గా చూసుకోవాలని నిర్ణయించుకున్నాం. మేం గత ఐదేళ్లలో చాలా సంతోషంగా ఉండటమే కాకుండా మాలోని చెడు శక్తులతో పోరాడాం. అంతిమంగా మీరు కోరుకున్నట్టే విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇది చాలా కాలంగా కొనసాగుతోంది. ఈ బ్రేకప్ సోషల్ మీడియాలో కన్పించినంత సులభం కాదు. ఇద్దరూ కలిసి ఉండేందుకు ప్రయత్నించాం కానీ..మా ఇద్దరి దారులు వేరని తెలిసి ఆగిపోయాం. మా జీవితాలకు ఏది అవసరమో తెలుసుకున్నాం. ఇది మాకు చాలా కష్టమైనదే. కానీ ఈ పరిస్థితుల్లో ఇది తప్పదు. మీరు మా ప్రైవసీకు భంగం కల్గించరని కోరుతున్నాం. 

Also read: RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ న్యూ ఇయర్ ట్రీట్.. 'రైజ్ ఆఫ్ రామ్' సాంగ్ వచ్చేసింది! ఫ్యాన్స్‌కి కిక్కే కిక్కు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News