`2.0` సినిమాలో పాటలెన్నో తెలుసా ?
శంకర్.. ఈ పేరు తెలియని సినిమా ప్రేక్షకుడు ఉండరు. సినిమాలో కధకు ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తారో.. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు చూస్తే ఈపాటికే అర్థమయ్యివుంటుంది. తొలి సినిమా 'జెంటిల్ మెన్' నుంచి 'ఐ' వరకు ఆయన సినిమాలే ఇందుకు నిదర్శనం. 90వ దశకంలోనే పాటలకు కోట్లు ఖర్చు పెట్టించారు శంకర్. అద్దిరిపోయే సెట్లు, అందమైన లొకేషన్లలో పాటలు చిత్రీకరించడం శంకర్ ఉన్న ప్రత్యేకత.
కానీ ఈసారి శంకర్ తన సినిమా జీవితంలో ఎన్నడూలేని విధంగా రోబో సినిమా సీక్వెల్ '2.0' లో పాటలు కుదించారు. సాధారణంగా అయితే సినిమాకు ఐదు లేదా ఆరు పాటలు ఉంటాయి. కానీ ఈ సినిమాలో మాత్రం మూడు పాటలు ఉన్నట్లు స్వయానా సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చెప్పారు. సినిమాలోని రెండు పాటలను దుబాయ్ లో జరిగిన ఈవెంట్ లో లాంచ్ చేశారు. మరోపాటను సినిమా విడుదలకు ముందు లంచ్ చేస్తారట. ఎప్పుడూ పాటల మీద ప్రత్యేక దృష్టిపెట్టే శంకర్.. ఈ సినిమాలో మాత్రం మూడు పాటలకు ఎందుకు పరిమితమయ్యాడా అని డౌట్? బహుశా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులందరికీ చేరువ చేసేందుకే పాటలను తగ్గించారా? అని సినీవర్గాలు భావిస్తున్నాయి.