Vishwak Sen Film: యంగ్​ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం 'అశోకవనంలో అర్జున కళ్యాణం'. ఇటీవలే ఈ సినిమా టీజర్ (Vanamlo Arjuna Kalyanam Update)​ రిలీజ్ అవగా.. దానికి మంచి స్పందన వచ్చింది. ఇదే ఊపులో చిత్ర యూనిట్ మరో అప్​డేట్​ ఇచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాలోని ఓ మెలొడీ లిరికల్​ సాంగ్​ను గురువారం రిలీజ్​ చేసింది (Vishwak Sen new Film update) చిత్ర యూనిట్​. 'ఓ ఆడపిల్లా' అనే టైటిల్​తో ఈ సాంగ్​ను విడుదలైంది. యూట్యూబ్​ సహా దాదాపు అన్ని ఆడియో ప్లాట్​ఫామ్స్​లో అందుబాటులోకి వచ్చిన ఈ పాట.. యూత్​ను తెగ ఆకట్టుకుంటోంది.


సాంగ్​ గురించి..


'మాటరాని మాయవా.. మాయజేయు మాటవా.. మాటులోని మల్లెవా.. మల్లె మాటు ముల్లువా.. ఓ ఆడపిల్లా.. నువ్వర్థం కావా..’ అంటూ సాంగ్ (Vanamlo Arjuna Kalyanam first single) సాగుతుంది.


ఈ సాంగ్​లో హీరో విశ్వక్​ సేన్​ 90లలో యువకుడిలా కనిపించారు. హీరోయిన్​ రుక్సార్​ ధిల్లాన్​ కూడా అచ్చ తెలుగు అమ్మాయిలా కలిపించింది.


ఇక పాట బ్యాగ్రౌండ్​ను బట్టి చూస్తే.. ఓ మిడిల్​ క్లాస్​ ఫ్యామిలీ, లవ్​ ఎంటర్​టైనర్​గా ఈ సినిమా సాగనున్నట్లు తెలుస్తోంది.


తాజాగా విడుదలైన ఈ పాటను అనంత శ్రీరామ్​ రాయగా.. రామ్ మిరియాలా పాపడారు. జయ్​ క్రిష్ సంగీతమందించారు.



అశోకవనంలో అర్జున కళ్యాణం గురించి..


విశ్వక్​ సేన్​, రుక్సార్​ ధిల్లాన్​, రిథికా నాయక్​ ప్రధాన పాత్రలు పోషించారు. విధ్యాసాగర్​ చింతా దర్శకత్వం సినిమాకు దర్శకత్వం (Vanamlo Arjuna Kalyanam details) వహించారు. రవి కిరణ్ కోలా కథ అందించగా.. విప్లవ్ ఎడిటర్​గా పని చేశారు. ఎస్​వీసీసీ డిజిటల్​ బ్యానర్​పై బాపినీడు బీ, సుధీర్​ ఈదర నిర్మాతలు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అన్ని అనుకున్నట్లు కుదిరితే ఏప్రిల్​ 14న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.


Also read: Hansika Motwani Photo: అందాల భామ హన్సిక ఏంటి ఇలా మారిపోయింది?


Also read: Dhanush Good Son In Law : ధనుష్‌పై పొగడ్తల వర్షం కురిపించిన రజనీకాంత్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook