Ooru peru bhairavakona Pre Release Business: సందీప్ కిషన్ హిట్ కొట్టి చాలా యేళ్లే అవుతోంది. ఇన్నేళ్లు సినీ ఇండస్ట్రీలో హీరోగానే కాకుండా.. సైడ్ హీరోగా.. సహాయ నటుడి పాత్రల్లో నటిస్తూ కెరీర్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. కానీ హీరోగా ఇప్పటికీ సరైన బ్రేక్ రాలేదు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లో డిఫరెంట్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'ఊరు పేరు భైరవకోన' మూవీతో పలకరించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అపుడెపుడో వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'టైగర్' మూవీ చేసాడు. ఆ సినిమా బాహుబలి సినిమాకు పోటీగా విడుదలై ఓ మోస్తరుగా నడించింది. అంతకు ముందు సందీప్ కిషన్ సోలో హిట్ అంటే 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' మూవీ అనే చెప్పాలి. ఆ తర్వాత హిట్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాడు.


తాజాగా ఈయన నటించిన 'ఊరి పేరు భైరవకోన' మూవీ ఎపుడో షూటింగ్ కంప్లీటైంది. కానీ విడుదల వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. తెలుగు రాష్ట్రాల్లో


ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన బిజినెస్ లెక్కల విషయానికొస్తే..
తెలంగాణ (నైజాం).. రూ. 3 కోట్లు..
రాయలసీమ (సీడెడ్).. రూ. 1.3 కోట్లు..
ఆంధ్ర ప్రదేశ్ .. రూ. 4.4 కోట్లు..
ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ కలిపి .. రూ. 8.70 కోట్లు


కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్.. 1.5 కోట్లు..
ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.20 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.


ఈ సినిమా థియేట్రికల్‌గా హిట్ అనిపంచుకోవాలంటే రూ. 11 కోట్లు రాబట్టాలి.
హీరోగా సందీప్ కిషన్ రేంజ్‌కు ఇది చాలా ఎక్కువే అని చెప్పాలి. మొత్తంగా ఈ సినిమాకు వచ్చిన టాక్‌ను బట్టి ఈ సినిమా ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.


ఫిబ్రవరి వంటి అన్ సీజన్ నెలలో ఈ సినిమాకు ఈ రేంజ్ బిజినెస్ కావడం.. ఈ సినిమా జానర్ ప్రత్యేకం కాబట్టి ఈ రేంజ్ వసూళ్లు రాబట్టడం ఈజీ అని చెబుతున్నారు. మరి ఫిబ్రవరి వంటి అన్‌సీజన్‌లో 'ఊరి పేరు భైరవకోన' మూవీతో సందీప్ కిషన్ హిట్టు కొట్టి తన ఫేట్ మార్చుకుంటాడా.. ? లేదా అనేది చూడాలి.


Read More: Vijay Devarakonda - Family Star: విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' మూవీ ఫస్ట్ సింగిల్‌కు సూపర్ రెస్పాన్స్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook