Ormax Media Survey: టాలీవుడ్ సినిమాలో అగ్రనటులు, నటీమణులు చాలామంది ఉన్నారు. మరి వీరందరిలో ఎవరు టాప్ అంటే సమాధానం లేదు. కానీ ఆ ప్రతిష్ఠాత్మక సంస్థ సర్వే మాత్రం ఎవరు టాప్ అనేది తేల్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓర్మాక్స్ మీడియా అనేది ఓ కన్సల్టింగ్ సంస్థ. వివిధ సినిమా పరిశ్రమల్లో మోస్ట్ పాపులర్ నటులు ఎవరనే విషయంపై తరచూ సర్వే నిర్వహిస్తుంటుంది. ఇందులో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమల్లో టాప్ హీరో, హీరోయిన్లు ఎవరనే విషయంలో టాప్ 10 జాబితా ప్రకటించింది. 


బాలీవుడ్‌లో టాప్ హీరోగా అక్షయ్ కుమార్ నిలిస్తే..రెండు, ముడు నాలుగు స్థానాల్లో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్‌లు ఉన్నారు. హీరోయన్లలో ఆర్ఆర్ఆర్ హీరోయిన్ అలియా భట్ టాప్‌లో నిలవగా, దీపికా, కత్రినాలు 2, 3 స్థానాల్లో ఉన్నారు. 10వ స్థానంలో అనుష్క శర్మ నిలిచింది. 


ఇక తమిళంలో టాప్ హీరోయిన్‌గా నయన తార ఉంటే..తరువాతి స్థానాల్లో సమంత, కీర్తి సురేశ్, త్రిష, జ్యోతికలు ఉన్నారు. తమిళ హీరోల్లో..తళపతి విజయ్ అగ్రస్థానంలో ఉన్నాడు. అజిత్, సూర్య, విజయ్ సేతుపతి, ధనుష్‌లు 2,3,4,5 స్థానాల్లో ఉన్నారు. రజనీకాంత్ 7వ స్థానంలో ఉండటం ఆశ్చర్యకరంగా ఉంది. 


ఇక హాలీవుడ్ హీరోయిన్ల విషయానికొస్తే..స్కార్లెట్ జాన్సన్, ఏంజిలినా జోలీ, ఎమ్మా వాట్సన్, జెన్నిఫర్ లారెన్స్ లు తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఇక హీరోలకు సంబంధించి టామ్ క్రూజ్ అగ్రస్థానంలో నిలిచాడు. రాబర్ట్ డౌనీ జూనియర్, డ్వేన్ జాన్సన్, విల్‌స్మిత్‌లు 2, 3, 4 స్థానాల్లో ఉన్నారు. 


తెలుగులో ఎవరు టాప్


ఇక తెలుగు సినీ పరిశ్రమకు సంబంధంచి ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. మోస్ట్ పాపులర్ టాప్ 10 జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రభాస్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ, చిరంజీవి, రవితేజలు వరుసగా 2 నుంచి పది స్థానాల్లో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి 9వ స్థానంలో, పవన్ కళ్యాణ్ 7వ స్థానంలో ఉండటం గమనార్హం. ఇక హీరోయిన్లలో అగ్రస్థానంలో సమంత నిలిచింది. సమంత తరువాతి స్థానంలో..కాజల్ అగర్వాల్, అనుష్క శెట్టి, పూజా హెగ్డే, రష్మిక మందన్నా, తమన్నా, కీర్తి సురేష్, సాయి పల్లవి, రకుల్ ప్రీత్‌సింగ్, రాశి ఖన్నాలు తరువాతి స్థానాల్లో నిలిచారు. సమంత తెలుగులో టాప్‌లో నిలిస్తే..తమిళంలో రెండవ స్థానంలో ఉండటం విశేషం.


Also read: OTT Platforms: ఓటీటీల మధ్య పెరుగుతున్న పోటీ, థియేటర్ల సంగతి ముగిసినట్టేనా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.