Ormax Most popular female Telugu film stars November 2022: ఎలా అయితే ఆర్మాక్స్ మీడియా సంస్థ మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ జాబితా ప్రచురిస్తుందో అదే విధంగా మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్ జాబితా కూడా ప్రతి నెల విడుదల చేస్తూ వస్తోంది. తాజాగా నవంబర్ నెలకి సంబంధించిన మేల్ అలాగే ఫిమేల్ స్టార్స్ జాబితా విడుదలైంది. ఇక ఈ జాబితాలో ఎప్పటి లాగే సమంత టాప్ ప్లేస్ సంపాదించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల యశోద అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరినీ ఆకట్టుకున్న సమంత గురించి సోషల్ మీడియాలో మీడియాలో ఎక్కువగా జరిగి చర్చ జరిగిందని చెప్పక తప్పదు. ఇక ఆమె తర్వాతి స్థానంలో కాజల్ అగర్వాల్ రెండవ స్థానం దక్కించుకుంది. ఇక మూడో స్థానంలో అనుష్క శెట్టి నాలుగవ స్థానంలో సాయి పల్లవి నిలిచారు. ఐదవ స్థానంలో రష్మిక మందన్న నిలవగా ఆరవ స్థానంలో పూజా హెగ్డే నిలిచింది.


ఇక ఏడవ స్థానంలో కీర్తి సురేష్ ఎనిమిదవ స్థానంలో తమన్నా నిలిచారు. ఇక  టీనేజ్ భామ కృతి శెట్టి తొమ్మిదవ స్థానం దక్కించుకోగా రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం 10వ స్థానం దక్కించుకుంది. ఇక ఈ జాబితాలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కాజల్ అగర్వాల్, అనుష్క శెట్టి సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి అసలు వాళ్ళు ఏం సినిమాలు చేస్తున్నారనే విషయం మీద కూడా క్లారిటీ లేదు.


అలాగే సాయి పల్లవి కూడా తెలుగులో ఇప్పుడు చేస్తున్న సినిమా ఒకటి కూడా లేదు. అదేవిధంగా రకుల్ ప్రీత్ సింగ్ కేవలం బాలీవుడ్కే పరిమితమైంది కానీ తెలుగులో ఆమె ఒక సినిమా కూడా అనౌన్స్ చేయలేదు. అయినా వీరందరూ కూడా తెలుగు మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ జాబితాలో టాప్ టెన్ ప్లేసెస్ దక్కించుకోవడం గమనార్హం. మొత్తం మీద టాప్ టెన్ హీరోయిన్స్ లిస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


Also Read: Avatar 2 Box Office : నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫర్ట్.. అవతార్ 2 దెబ్బకు అన్ని రికార్డులు మాయం


Also Read: Bigg Boss Samrat : కొత్త ఇంట్లోకి భార్యతో అడుగుపెట్టిన బిగ్ బాస్ సామ్రాట్.. పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook