Oscar 2024 - RRR: ఆస్కార్ అవార్డు.. ప్రతి సినీ కళాకారుడు ఆ అవార్డును జీవితంలో ఒక్కసారైన అందుకోవాలని కలలు గంటూ ఉంటారు. గతేడాది రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' మూవీ ఆస్కార్ అవార్డుల్లో భాగంగా 'నాటు నాటు' సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయింది. అంతేకాదు అవార్డు గెలిచి సంచలనం సృష్టించింది. దీంతో మన భారతీయులు ఉప్పొంగిపోయారు.  ఒక భారతీయులు నిర్మించిన చిత్రానికి ఆస్కార్ అవార్డు రావడం ఇదే మొదటిసారి. ఈ అవార్డును మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో పాటు చంద్రబోస్‌కు అందజేసారు. ఈ సినిమాలో నాటు నాటు పాట వరల్డ్ వైడ్‌గా ఫేమస్ అయింది. ఆ పాటలోని స్టెప్స్ తాజాగా జరిగిన ఆస్కార్ అవార్డుల వేడుకలో మరోసారి దర్శనమిచ్చాయి. బెస్ట్ ఒరిజినల్  స్కోర్ సాంగ్ విభాగంలో అవార్డును ప్రకటించే సమయంలో లాస్ ఏంజెల్స్‌లో డాల్బీ థియేటర్‌లో మరోసారి ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటను ప్రదర్శించారు. దాంతో పాటు ఇప్పటి వరకు సిల్వర్ స్క్రీన్ పై వచ్చిన బెస్ట్ స్టంట్స్‌కు సంబంధించిన స్పెషల్ వీడియోను ఈ ప్రతిష్ఠాత్మక అకాడమీ అవార్డుల వేదికపై ప్రదర్శించారు. ఇందులో భాగంగా ఆర్ఆర్ఆర్ సినిమాలోని రెండు యాక్షన్ సీన్స్ చూపించారు. దీనికి సంబంధించిన వీడియో ఆర్ఆర్ఆర్ ఎక్స్ లో షేర్ చేసింది. దీంతో ఆర్ఆర్ఆర్ మూవీ లవర్స్ ప్రపంచం ఇంకా నాటు నాటు పాట ఫీవర్ నుంచి బయటకు రాలేకపోతుదనే కామెంట్స్ చేస్తున్నారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఈ ఇయర్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు 'బార్బీ' సినిమాలోని 'వాట్ వాస్ ఐ మేడ్ ఫర్' అనే సాంగ్‌కు వచ్చింది. ఈ సారి ఆస్కార్ బరిలో క్రిస్టఫర్ నోలన్ తెరకెక్కించిన బయోగ్రాఫికల్ థ్రిల్లర్ 'ఓపెన్‌హైమర్' మూవీ సత్తా చాటింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు సహా పలు విభాగాల్లో అవార్డులు గెలచుకొని సత్తా చాటింది.


ఆర్ఆర్ఆర్ మూవీ విషయానికొస్తే.. ఈ సినిమా 2021 జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో సత్తా చాటింది. ఉత్తమ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విభాగంలో కీరవాణితో పాటు కొరియోగ్రఫీ, యాక్షన్ స్టంట్స్, బెస్ట్ పాపులర్ మూవీగా పలు విభాగాల్లో అవార్డుల అందుకుంది. ప్రస్తుతం రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత మహేష్ బాబుతో ప్యాన్ వరల్డ్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ మూవీకి సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నట్టు చెప్పాడు.


Also Read: AP Politics: వైసీపీలోకి ముద్రగడ పద్మనాభం.. ప్రతిపక్షాలకు షాక్‌.. జగన్‌కు బూస్ట్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook