Oscars 2023 Full winners list 95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో మన దేశం తలెత్తుకుని తిరిగింది. నాటు నాటు పాటను ప్రదర్శించిన తీరుకు ఆస్కార్ యూనిట్ మొత్తం స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చేసింది. ఈ సారి రెండు ఆస్కార్ అవార్డులు కొల్లగొట్టి మన దేశం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. నాటు నాటు పాట, ది ఎలిఫెంట్ విష్పరర్స్ ఆస్కార్ అవార్డులను మన ఇండియాకు తీసుకొచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ అనే సినిమాకు ఏడు ఆస్కార్ అవార్డులు వచ్చాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకులు, స్క్రీన్ ప్లే, ఉత్తమ నటి, సహాయ నటుడు, సహాయ నటి, ఎడిటర్ ఇలా అన్ని కేటగిరీల్లో సత్తా చాటింది. ఇక ఆల్ క్వింట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ అనే చిత్రానికి ఉత్తమ సంగీతం, ప్రొడక్షన్ డిజైనర్, కొరియోగ్రాఫర్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీల్లో నాలుగు అవార్డులు వచ్చాయి.


ఉత్తమ చిత్రం : ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
ఉత్తమ దర్శకుడు : డానియల్ క్వాలన్, డానియల్ సాచినర్ట్‌ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ నటుడు : బ్రెండన్ ఫ్రాజర్‌ (ది వేల్)
ఉత్తమ నటి : మిచెల్ యో (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ సహాయ నటుడు : కి హు క్వాన్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ సహాయ నటి : జామీ లీ కర్టీస్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ సంగీతం : వోల్కర్ బెర్టల్మెన్ (ఆల్ క్వింట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్)
ఉత్తమ పాట : నాటు నాటు (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ ఎడిటర్ : పాల్ రోజర్స్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ స్క్రీన్ ప్లే : డానియల్ క్వాలన్, డానియల్ సాచినర్ట్‌ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే : సారా పొల్లే (వుమెన్ టాకింగ్)
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ : నవాల్ని
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ : ది ఎలిఫెంట్ విష్పరర్స్
బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ : ది వేల్
ఉత్తమ విదేశీ చిత్రం : ఆల్ క్వింట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ : గిల్లెర్మో దెల్ టోరోస్ పినాచియో
బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ : ది బాయ్, ది మోల్, ది ఫాక్స్ అండ్ ది హార్స్
ఉత్తమ నృత్యదర్శకుడు : జేమ్స్ ఫ్రెండ్ (ఆల్ క్వింట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ : అవతార్ 2
బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్  : క్రిస్టియన్ ఎం గోల్డ్ బెక్ (ఆల్ క్వింట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్)
బెస్ట్ క్యాస్టూమ్ డిజైన్ : రూత్ కార్టర్ (బ్లాక్ పాంథర్ వకాండ ఫరెవర్)
బెస్ట్ సౌండ్ : టాప్ గన్ మావెరిక్


Also Read:  Oscars 2023 Live Updates: ఆస్కార్ విజేతల జాబితా, ఎవరెవరికి ఏ అవార్డులు


Also Read: Oscars 2023: తెలుగోడి సత్తాచాటిన 'నాటు నాటు'. Naatu Naatu పాటను వరించిన ఆస్కార్ అవార్డు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFaceboo