Oscar Awards 2024: సినిమా ప్రపంచంలో ఆస్కార్ అతిపెద్ద అవార్డు వేడుక. ప్రతి యేటా లాస్ ఏంజిల్స్ డాల్ఫీ థియేటర్ వేదికగా జరిగే ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా విశిష్టత, ప్రత్యేకత ఉన్నాయి. ప్రస్తుతం ఆస్కార్ 96వ వేడుక అత్యంత ఘనంగా జరుగుతోంది. గత ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమా పాటకు లభించిన ఆస్కార్ అవార్డుతో ఇండియాలో ఆస్కార్ క్రేజ్ మరింత పెరిగిందని చెప్పవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారతదేశపు మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డు గెల్చుకున్నప్పటి నుంచి ఇండియాలో ఆస్కార్ అవార్డులకు క్రేజ్ పెరిగింది. గత ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించడంతో ఆ ఖ్యాతి మరింతగా పెరిగింది. ఈ ఏడాది ఆస్కార్ బరిలో భారతదేశపు సినిమాలు ఏవీ బరిలో లేవు. కానీ భారతీయుల్లో ఆస్కార్ వేడుకపై ఆసక్తి ఎక్కువగా కన్పిస్తోంది. ఇవాళ తెల్లవారుజామున ప్రారంభమైన అవార్డుల ప్రదానోత్సవం అత్యంత ఘనంగా జరుగుతోంది. 


అందరూ ఊహించినట్టే హాలీవుడ్ సినిమా ఓపెన్ హైమర్ ఆస్కార్ 96వ వేడుకలో అవార్డులు కొల్లగొడుతోంది. 13 కేటగరీల్లో పోటీకి నిలిచిన ఈ సినిమా చాలా అవార్డులు సాధించింది. బెస్ట్ సపోర్టింగ్ రోల్, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ సినిమాటోగ్రఫీ కేటగరీల్లో అవార్డులు దక్కించుకుంది. ఇండియా నుంచి డాక్యుమెంటరీ ఫిలిం కేటగరీకు ఎంపికైన టు కిల్ ఎ టైగర్‌కు అవార్డు లభించలేదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంగా రూపొందిన డాక్యుమెంట్రీ ఫీచర్ ఫిలిం 20 డేస్ ఇన్ మారిపోల్‌కు అవార్డు లభించింది. 


ఆస్కార్ 96వ వేడుకలో కొన్ని అవార్డులు


ఓపెన్ హైమర్ సినిమా రాబర్ట్ డౌనీ జూనియర్ ఉత్తమ సహాయ నటుడు
ది హోల్డోవర్స్ సినిమా  డేవైన్ జో రాండాల్ప్ ఉత్తమ సహాయ నటి
ది బాయ్ అండ్ ది హిరాన్ ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం
పూర్ థింగ్స్, సినిమా హోలి వెడ్డింగ్‌టన్ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్
పూర్ థింగ్స్ సినిమా నుంచి జేమ్స్ ప్రైసే, షోనా హెత్‌లకు బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్స్
పూర్ థింగ్స్ సినిమా నుంచి నడియా స్టేసీ, మార్క్ కౌలియర్‌లకు బెస్ట్ హెయిల్ స్టైల్ అండ్ మేకప్ 
కార్డ్ జెఫర్‌పన్ సినిమాకు బెస్ట్ అడాప్టెండ్ స్క్రీన్‌ప్లే అవార్డు
ఎనాటమీ ఆఫ్ ఎ పాల్ నుంచి జస్టిన్ ట్రైట్, అర్ధర్ హరారీలకు బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే
ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ సినిమాకు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం
ది లాస్ట్ రిపేర్ షాప్ సినిమాకు ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం
ఓపెన్ హ్యామర్ సినిమా నుంచి హెయటే‌వన్ హోయటేమాకు బెస్ట్ సినిమాటోగ్రాఫర్
ఓపెన్ హ్యామర్ సినిమా నుంచి జెన్నీఫర్ లేమ్‌కు బెస్ట్ ఫిలిం ఎడిటింగ్
బెస్ట్ సినిమాగా ఓపెన్ హైమర్
బెస్ట్ డైరెక్టర్ క్లిస్టోఫర్ నోలన్ ఓపెన్ హైమర్
బెస్ట్ ఒరిజినల్ స్కోర్-లుడ్విన్ గోరాన్సన్ ఓపెన్ హైమర్


Also read: Sara Tendulkar: గ్లామర్ తో గరం గరం చేస్తున్న సచిన్ కూతురు.. మరి ఈ రేంజ్ లోనా.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook