ఆస్కార్ కంటే ముందే గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న నాటు నాటు పాట ఇంకొన్ని అవార్డులు కూడా సాధించింది. ఇప్పుడు ఆస్కార్ అవార్డు సాధించడం ద్వారా కుంభస్థలాన్ని కొట్టేసింది. ఆస్కార్ అవార్డు తీసుకుంటూ కీరవాణి..కార్తికేయకు ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకు చెప్పాడనేది ఆసక్తిగా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కార్తికేయ ఎవరో కాదు. దర్శకుడు రాజమౌళి కుమారుడు. సినిమా సెకండ్ యూనిట్ దర్శకుడు ఇతనే. వాస్తవానికి ఆర్ఆర్ఆర్ సినిమా భారతదేశం నుంచి అధికారికంగా ఆస్కార్ నామినేషన్‌కు ఎంపిక కాలేదు. ఫిలిమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆర్ఆర్ఆర్ సినిమాను ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌కు ఎంపిక చేయలేదు. దాంతో ఆర్ఆర్ఆర్ టీమ్ నిరాశకు లోనైంది. 


అంతే కార్తికేయ రంగంలో దిగాడు. దేశం నుంచి ఎంపిక కానప్పుడు సొంతంగా ఫారిన్ ఎంట్రీ ఆప్షన్ ఉంటుంది. కార్తికేయ ఆర్ఆర్ఆర్ సినిమాను ఫారిన్ ఎంట్రీలో ఆస్కార్ నామినేషన్‌కు పంపించాడు. అంతేకాదు..బెస్ట్ ఒరిజినల్ కేటగరీలో నాటు నాటు పాటను ప్రత్యేకంగా పంపించాడు. పంపించి వదిలి వేయకుండా..ఆర్ఆర్ఆర్ సినిమాని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసే బాధ్యత తీసుకున్నాడు. అమెరికాలో అత్యధికులకు ఈ సినిమా చేరేలా మార్కెటింగ్ స్ట్రాటెజీలు అవలంభించాడు. ముందు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కేలా చేశాడు. ఈ అవార్డు ఆధారంగా క్యాంపెయినింగ్ మరింత ముమ్మరం చేశాడు. ఆస్కార్ తుది నామినేషన్స్‌కు వెళ్లడం ఆ తరువాత మిగిలిన పాటల్ని వెనక్కి నెట్టి అవార్డు సాధించేవరకూ చాలా వర్క్ చేశాడు కార్తికేయ.


ఓ గొప్ప సినిమాను తండ్రి తెరకెక్కిస్తే..ఆ సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లడంలో కొడుకు కీలకపాత్ర పోషించాడు. అందుకే కీరవాణి ఆస్కార్ వేదికపై కార్తికేయకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. 


Also read: Telangana: ఆర్ఆర్ఆర్‌ను ఇండియా అధికారికంగా ఎందుకు పంపలేదు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook